Advertisement
Google Ads BL

నయనతార ఉసురు తగిలింది ఈ హీరోకి..!


తనలోని కొరియోగ్రాఫర్‌ని, నటుడిని బయటపెట్టిన ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా ఎమ్మెస్‌ రాజు నిర్మాతగా సిద్దార్ద్‌, త్రిషలతో వచ్చిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంతో తొలి హిట్‌ కొట్టాడు. కానీ ఆతర్వత ప్రభాస్‌ హీరోగా ఎమ్మెస్‌ రాజునే నిర్మించిన 'పౌర్ణమి'తో డిజాస్టర్‌ అందుకున్నాడు. చిరంజీవి పిలిచి మరీ రీమేక్‌గా 'శంకర్‌దాదా జిందాబాద్‌' తీయమంటే, బాలీవుడ్‌లోలాగా సున్నితంగా కథను డీల్‌ చేయడం చేతకాక, అందునా ఓ చెత్త హీరోయిన్‌ని చిరు పక్కన జోడీగా తీసుకోవడంతో షరామమూలే ఫలితం వచ్చింది. 

Advertisement
CJ Advs

ఇక అక్కడి నుంచి ఆయన సౌత్‌ సినిమాలను బాలీవుడ్‌లో మక్కీకి మక్కీ దించుతూ ఒకానొక సమయంలో రీమేక్‌ చిత్రాల ద్వారానే బాలీవుడ్‌లో యమా డిమాండ్‌ సంపాదించుకున్నాడు. ఇక ఏ ముహూర్తాన అయితే ఆయన నయనతారతో తెగతెంపులు చేసుకున్నాడో అప్పటి వరకు డౌన్‌ఫాల్‌లో ఉన్న నయన టాప్‌ కాగా, టాప్‌లో ఉన్న ప్రభుదేవా కెరీర్‌ డౌన్‌ఫాల్‌ అయింది. ఇటీవల 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌తో 'పౌర్ణమి' నాటి స్నేహాన్నిగుర్తు చేస్తే ప్రభాస్‌తో ఓ చిత్రం చేయనున్నానని చెప్పాడు. దాంతో అందరూ ప్రభాస్‌ 'సాహో' పూర్తయిన తర్వాత ప్రభుదేవా చిత్రం ఉంటుందేమో లేకపోతే ఊరకనే ఎందుకు చెబుతాడు? అని భావించారు. 

కానీ ప్రభాస్‌ మాత్రం 'సాహో' తర్వాత 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణకే కమిట్‌ అయ్యాడని సమాచారం. ఇక నడిగర్‌ సంఘం బిల్డింగ్‌ నిధుల కోసం నాడు విశాళ్‌-కార్తీలు ఓ మలీస్టారర్‌ని ఉచితంగా చేయడానికి ముందుకొచ్చారు.దీనికి ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నాడు. టైటిల్‌ని కూడా 'కరుప్పు రాజా-వెల్లరాజా' (నలుపు రాజా- తెల్లరాజా) పేరుతో రెడీ చేశారు. ఇక ఈ చిత్రం త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తుండగా, స్క్రిప్ట్‌లో తేడాలొచ్చి విశాల్‌-కార్తీ ఇద్దరు హ్యాండిచ్చారు. ఒక హీరో నో అంటే ఓకే అనుకోవచ్చు. కానీ ఇద్దరు కూడా స్క్రిప్ట్‌ పట్ల అనుమానంగా ఉన్నారంటే ప్రస్తుతం ప్రభుదేవాకు బ్యాడ్‌ టైమ్‌ నడుస్తోందనే భావించాల్సి ఉంటుంది...! 

Prabhu Deva Drops 'Karuppu Raja Vellai Raja'?:

The film is a multi-starrer starring Vishal, Karthi and Sayyesha in the lead and was recently launched in Chennai.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs