Advertisement
Google Ads BL

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దే టాప్ ప్లేస్..!


ఎన్టీఆర్ వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా ఇరగదీస్తున్నాడు. స్టార్ మా లో బిగ్ బాస్ కి హోస్ట్ గా ఎన్టీఆర్ తన అభినయంతో అదరగొడుతున్నాడు. ఈ బిగ్ బాస్ షో మొదలయ్యి దాదాపు 10 రోజులు కావొస్తుంది. అయితే ఎన్టీఆర్ కేవలం శని, ఆది వారాల్లో మాత్రమే బిగ్ బాస్ లో కనిపిస్తున్నాడు. మిగతా రోజులన్నీ పార్టిసిపేట్స్ మాత్రమే కనిపిస్తారు. ఇక బుల్లితెర మీద ఎన్టీఆర్ మొదటిసారి చేస్తున్న ఈ షోకి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఆ క్రేజ్ కి తగ్గట్టే ఎన్టీఆర్ మాట, డాన్సులు, జ్ఞాపక శక్తితో ఈ షోలో ఐదు రోజులు జరిగే వాటిని గుర్తు పెట్టుకోవడం, మంచి ఫిజిక్ స్టయిల్ ఉండడం వంటి అంశాలతో ఈ షో మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. 

Advertisement
CJ Advs

ఇక ఈ అంచనాలను తల్లకిందులు చేస్తూ ఈ షోకి అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్ వచ్చినట్టు సమాచారం అందుతుంది. బుల్లితెర మీద ఈ బిగ్ బాస్ షోకి రికార్డు స్థాయిలో టీఆర్ఫీ రేటింగ్ వచ్చిందంటున్నారు. ఎన్టీఆర్ కనిపించే ఎపిసోడ్స్ లో స్టార్ మా ఛానల్ కి రికార్డు స్థాయిలో 16.18  టీఆర్ఫీ రేటింగ్ వచ్చిందని స్టార్ మా అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరి ఈ రేటింగ్ చూస్తుంటే తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ షోని ఎంతెలా ఆదరిస్తున్నారో... అర్ధమవుతుంది. ఇక ఈ మధ్య కాలంలో ఒక ఛానల్ కి ఇంత అత్యధిక రేటింగ్ రావడం మాత్రం ఇదే మొదటిసారి అని అంటున్నారు.

ఇక ఈ రేటింగ్ తో స్టార్ మా ఒక్కసారిగా హైలెట్ అయ్యింది. అయితే ఈ మధ్యన స్టార్ మా ఛానల్ నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ బిగ్ బాస్ షో తో ఒక్కసారిగా స్టార్ మా మొదటి స్థానానికి రావడం ఇక్కడ విశేషంగా చెబుతున్నారు. ఇకపోతే నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి హోస్ట్ గా చేసినప్పుడు టీఆర్పీ రేటింగ్ 12.34  ఉండగా, జెమినిలో రానా హోస్ట్ గా వస్తున్న నెంబర్ వన్ యారి కి 9.1  టీఆర్పీ వచ్చింది. ఇక మెగాస్టార్ చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు కి పేలవంగా 3.6  రేటింగ్ వచ్చింది. ఇక వీటన్నిటిని పరిశీలిస్తే మాత్రం ఎన్టీఆర్ ప్రస్తుతానికి ఎవరికీ అందనంత ఎత్తులో కూర్చున్నాడనేది మాత్రం నిజం.

JR NTR Bigg Boss TRP Rating Sensation:

Jr Ntr Big Boss Show Highest TRP Ratings For Star Maa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs