Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ని.. ఈ డైరెక్టర్ మాములుగా పొగడలా..!


ఎన్టీఆర్ అంటే డాన్స్... డాన్స్ అంటే ఎన్టీఆర్ అనేది టాలీవుడ్ లో ఎప్పటినుండో నానుతున్న మాట. ఎన్టీఆర్ తో చేసిన డైరెక్టర్స్ అంతా ఎన్టీఆర్ డాన్స్ ని అతని నటనను ఎంతగానో పొగిడేస్తుంటారు. మరి ఎన్టీఆర్ తో పనిచేసిన డైరెక్టర్స్ అందరూ ఆయా సినిమాల విడుదలకు ముందు ప్రమోషన్స్ లోనో లేకుంటే సినిమాలు విడుదలయ్యాక అయినా ఎన్టీఆర్ ని పొగడడమే చూశాం. కానీ ఇప్పుడు 'జై లవ కుశ' డైరెక్టర్ బాబీ మాత్రం 'జై' టీజర్ ఒక్కటి విడుదల చేశాడో లేదో ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ గురించి చెబుతూ తెగ పొగిడేశాడు. ఎన్టీఆర్ నటనలో ఎంతో ఎత్తులో ఉన్నాడని కూడా చెప్పాడు.

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ 'జై లవ కుశ'లో డాన్స్ విషయంలో ఇరగదీస్తున్నాడని చెబుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం 'జై లవ కుశ' పాటల షూటింగ్ జరుగుతుందట. మరి పాటల చిత్రీకరణ అంటే ఎన్టీఆర్ డాన్స్ ఉంటుంది కదా. ఇక ఆ పాటల చిత్రీకరణలో ఎన్టీఆర్ డాన్సింగ్ స్కిల్స్ కి డైరెక్టర్ బాబీ షాక్ అయ్యాడట. మరి ఆ రేంజ్ లో ఎన్టీఆర్ డాన్స్ లో అదరగొట్టేస్తున్నాడన్నమాట. ఇక బాబీ, ఎన్టీఆర్ డాన్స్ ని పొగిడేస్తూ సోషల్ మీడియాలో.... ఎన్టీఆర్ గారు మన కళ్ల ముందు డ్యాన్స్ చేస్తుంటే చూడటం నమ్మశక్యం కాని అనుభవం...... ఆ ప్రతిభ అతడికి ఒక వరం. తారక్ ను అలా చూడటం నా అదృష్టం అంటూ పోస్ట్ చేశాడు. 

ఇక బాబీ అలా ట్వీట్ చేసాడో లేదో ఇలా ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ హీరోగారి డాన్స్ పవర్ ఏమిటో చూస్తారా.. అంటూ రెచ్చిపోతున్నారు. మరి వారు 'జై లవ కుశ' లో ఎన్టీఆర్ రాకింగ్ డాన్స్ చూడడానికి సినిమా విడుదల వరకు కూడా ఆగేలా కనిపించడం లేదంటున్నారు. కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ 'జై లవ కుశ' షూటింగ్ ప్రస్తుతం పూణే లో జరుగుతుంది. ఈ చిత్రం వచ్చే దసరా కానుకగా విడుదల కానుంది. 

Director Bobby Praises NTR Dance:

Director Bobby Tells Jai Lava Kusa Movie Latest Updates 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs