Advertisement
Google Ads BL

నాగ్‌ దూకుడు మామూలుగా లేదు..!


తన కుమారులతో పాటు తన చిత్రాల నిర్మాణం, నటన, సినిమాల విడుదల, వారిని ఓ ఇంటివారిని చేసే బాధ్యతలతో నాగ్‌ జోరు పెంచాడు. ఆయన తాను నటిస్తున్న 'రాజు గారి గది 2'ని అక్టోబర్‌ 13కు ఫిక్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నిర్మాత పివిపి అయినా సర్వాదికారాలు నాగ్‌ చేతిలోనే ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ఇక తాజాగా ఆయన తన పెద్ద కుమారుడు నాగ చైతన్య-సమంతల పెళ్ళి పనులు కూడా చూస్తున్నాడు. 

Advertisement
CJ Advs

పనిలో పనిగా తన చిన్న కుమారుడు అక్కినేని అఖిల్‌ రెండో చిత్రం పై కూడా క్లారిటీ ఇచ్చేశాడు. అఖిల్‌ మొదటి చిత్రం 'అఖిల్‌'తర్వాత రెండో ప్రాజెక్ట్‌ని ఓకే చేయడానికే ఎక్కువ సమయాన్నితీసుకున్నాడు. ఈ చిత్రం నిర్మాతగానే కాకుండా, అఖిల్‌ తండ్రిగా కూడా ఎక్కువ శ్రధ్దే తీసుకున్న నాగార్జున ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతున్నరామోజీ ఫిల్మ్‌ సిటీకి తాజాగా వెళ్లాడట. అక్కడ దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌, సినిమాటోగ్రాఫర్‌ వినోద్‌ల పనితీరు చూసిన ఆయన ఎడిటింగ్‌ రూమ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన రషెష్‌ చూసి ఔట్‌పుట్‌ పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేశాడట. 

దాంతో వెంటనే తానే నిర్మాత కాబట్టి దర్శకుడు విక్రమ్‌ కెకుమార్‌ని షూటింగ్‌ ఎప్పటికల్లా పూర్తవుతుంది...? మిగిలిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల మాటేమిటి? వంటి విషయాలపై పూర్తిగా చర్చించి ఈ చిత్రాన్ని ఇదే ఏడాది డిసెంబర్‌ 22ని నిర్ణయించి, ఫిక్స్‌ చేశాడు. నాగార్జునకు ఇంతకు ముందు నుంచి డిసెంబర్‌ సెంటిమెంట్‌తో పాటు క్రిస్మస్‌ సెంటిమెంట్‌ ఉంది. డిసెబంబర్‌, క్రిస్మస్‌ సెంటిమెంట్‌ ఉన్నవారిలో బాలీవుడ్‌లో అమీర్‌ ఖాన్‌ ఒకరైతే టాలీవుడ్‌లో నాగార్జున ముఖ్యుడు. 

కానీ గత ఒకటి రెండేళ్లుగా ఆయన చిత్రాలు డిసెంబర్‌లో రావడం లేదు. సో.. డిసెంబర్‌ సెంటిమెంట్‌ని ఆయన తన చిన్నకుమారుడు అఖిల్‌కి ఇచ్చేశాడు. ఇక ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ, బాలీవుడ్‌ దర్శకుడు ప్రియదర్శన్‌ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. నాగ్‌ గతంలో ప్రియదర్శన్‌తో 'నిర్ణయం' చిత్రం చేసిన సంగతి తెలిసిందే, అఖిల్‌ తల్లిగా టబు నటిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ 'జున్ను' అనే ప్రచారం జరిగింది. కానీ దీనిని పక్కనపెట్టి మరిన్ని టైటిల్స్‌కి పరిశీలిస్తున్నారట. 

Nagarjuna Confirms Akhil Second Film Release Date:

Director Vikram K Kumar-Akhil Akkineni untitled project is produced by Nagarjuna’s Annapurna Studios and now they have officially announced that the film will be released on the 22nd of December.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs