సాధారణంగా డబ్బు అనేది సంపాదించడం మొదలుపెడితే అది ఓ వ్యసనంలాగా మారుతుందని మన పెద్దోళ్లేచెప్పారు. ఒకస్థాయి దాకా డబ్బు ఉండాలని, అక్కడి దాకా ఉంటే డబ్బు మనల్ని కాపాడుతుందని, ఆ స్థాయి దాటితే మనమే ఆ డబ్బును కాపాడాలని చెప్పారు. ఇక విషయానికి వస్తే తెలుగు హీరోలలో ఎక్కువగా బ్రాండ్ అంబాసిడర్లుగా, యాడ్స్‌లో కనిపించే వారిలో మహేష్‌బాబు ముందుంటాడు.
ఆ తర్వాత అఖిల్ ఆ ప్లేస్‌లోకి వస్తాడు. పవన్ చేనేతకు తప్ప ఇతర కమర్షియల్ ప్రాజెక్ట్స్‌కి పని చేయనని చెప్పేశాడు. రామ్ చరణ్, బన్నీలు ఏదో క్లోఅప్‌తో పాటు ఒకటి రెండింటిలో కనిపిస్తూ ఉంటారు. ఇక స్టార్‌గా తన కెరీర్ ఆల్‌రెడీ ఓ స్థాయికి, తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించే స్థితికి చేరానని బన్నీ కాన్ఫిడెన్ట్‌గా ఉన్నాడు. నెగటివ్ టాక్ వచ్చిన చిత్రాలు కూడా రికార్డు కలెక్షన్లు సాధిస్తున్నాయని దాంతోనే ఆయన నిశ్చింతగా ఉండనున్నాడు.
ఇక తాజాగా బన్నీ తన భార్య స్నేహారెడ్డితో కలసి ముంబైలో రెండు వారాలుగా ఉంటున్నాడు. అక్కడ తన తాజా చిత్రం, వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం 'నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా'కోసం బాలీవుడ్ ద్వయం విశాల్-శేఖర్‌లతో ట్యూన్స్ రెడీ చేయించే పనిలో ఉన్నాడు. అదే సమయంలో పలు స్టార్స్ ఫ్రొఫైల్స్‌తో బ్రాండ్ అంబాసిడర్ చాన్స్‌లు ఇప్పించే ఏజెన్సీ సంస్థలతో చర్చలు జరుపుతున్నాడు.
తన తాజా చిత్రాన్ని బాలీవుడ్ దియేటర్లలో రిలీజ్, ఎన్‌డార్స్‌మెంట్స్, ఇతర మ్యూజిక్ సిట్టింగ్స్.. ఇలా అన్నింటినీ ఒకే దెబ్బతో మూడు సినిమాలు- ఆరు యాడ్స్‌గా తన కెరీర్ జోరును పెంచాలని చూస్తున్నాడు. కాగా 'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా' చిత్రం దేశభక్తి నేపధ్యంలో రూపొందనుంది. ఇందులో బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు..!