Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ రోజుకి ఎంతో తెలిసింది..!


'బిగ్‌ బాస్‌'షో మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా కూడా శని, ఆదివారాల్లో ఎన్టీఆర్‌ కనిపిస్తున్నందువల్ల ఈషోకి వీకెండ్స్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. గత కొంతకాలంగా 'బిగ్‌ బాస్‌'లో పాల్గొంటున్నందుకు ఇంత రెమ్యూనరేషన్‌ని ఎన్టీఆర్‌ తీసుకుంటున్నాడని, కాదు .. కాదు అంతకంటే ఎక్కువే తీసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్‌ మాత్రం తాను ఓ ప్యాషన్‌, ఎనర్జీతో పాల్గొంటున్నానే గానీ తనకు, తన కుటుంబానికి సరిపడా సంపాదన తాను సంపాదిస్తున్నానని క్లారిటీ ఇచ్చాడు. 

Advertisement
CJ Advs

తాజాగా విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ షోకి ఎన్టీఆర్‌ తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌పై స్పష్టమైన ఫిగర్‌ బయటకు వచ్చింది. ఈ షో పది వారాల పాటు జరగనుంది. ఒక్కో వారంలో ఎన్టీఆర్‌ శని, ఆదివారాలు ఈ షోలో కనిపిస్తాడు. ఒక్కో రోజుకు ఆయన 35లక్షలు తీసుకుంటున్నాడు. అంటే ఒక వారానికి ఎన్టీఆర్‌ తీసుకునేది 70 లక్షలు. మొత్తం పది వారాలకు కలిపి 'బిగ్‌ బాస్‌'కి ఎన్టీఆర్‌కు మొత్తంగా 7కోట్లు లభించనుంది. ఆయనకున్న ఇమేజ్‌, స్టార్‌ మా కి ఉన్న ఆర్ధికవనరుల రీత్యా చూస్తే ఎన్టీఆర్‌ పెద్దగా ఎక్కువగా చార్జ్‌ చేయడం లేదని, మామూలు మొత్తాన్ని మాత్రమే తీసుకుంటున్నాడని అర్ధమవుతోంది. 

మరో వైపు ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ కూడా మొదటి కంటే రోజు రోజుకీ పదునెక్కుతోంది. మొదటి రోజు కంటే తాజాగా శని ఆదివారాలలో ఆయన మాటల చాకచక్యం, వాక్పిటమ బాగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి. ఓ నటునిగా అతనికి కూడా అందరి నుంచి ఇలాంటి కాప్లిమెంట్‌ తప్పించి మరేదీ పెద్దదిగా భావించడనే అంటున్నారు స్టార్‌మా యాజమాన్యం కూడా ఎన్టీఆర్‌ క్రేజ్‌, ఇమేజ్‌, ప్యాషన్‌, ఎనర్జీలతో పోల్చుకుంటే తామిస్తోందని తక్కువే అని అంటోంది. 

Jr NTR Charging Per Episode Rs 35 Lakhs :

According to a source, Jr NTR, who is hosting the ongoing Big Boss show on a Telugu channel, is charging Rs 35 lakhs per episode
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs