Advertisement
Google Ads BL

'లై' కి దిల్ రాజు హ్యాండ్ ఇవ్వడానికి కారణం?


టాలీవుడ్ లో తనకి ఏ చిత్రం మీదైనా నమ్మకం ఉంటే దిల్ రాజు దాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాత గానే కాదు ఒక డిస్ట్రిబ్యూటర్ గా కూడా తెగ ఉత్సాహం చూపిస్తాడు. అలాగే చిన్న సినిమాలు తనకి నచ్చితే తన బ్యానర్ లోనే ఎక్కువగా రిలీజ్ చేస్తుంటాడు. ఇక దిల్ రాజు బ్యానర్ నుండి సినిమా విడుదలకు సిద్ధమవుతోంది అంటే చాలు....  ఆ సినిమాకి ఎక్కడలేని క్రేజ్ వచ్చేస్తుంది. అలాంటి దిల్ రాజు ఇప్పుడొక సినిమాని తన పంపిణి సంస్థ ద్వారా విడుదల చెయ్యడానికి మొగ్గు చూపడంలేదనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

Advertisement
CJ Advs

నితిన్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కతున్న 'లై' చిత్రం ఆగష్టు 11 న విడుదల తేదీ ప్రకటించింది. ఈ చిత్రాన్ని నిర్మాతలు దాదాపు 40  కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ తాజాగా విడుదలై సినిమాపై మంచి అంచనాలే పెంచింది. ఇక ఈ చిత్రంలో నితిన్ చాలా స్టయిల్ గా అదిరిపోయాడు. అలాగే మరో సీనియర్ హీరో అర్జున్ కూడా స్టైలిష్ లుక్ లో ఇరగదీస్తున్నాడు. మరి ఇలాంటి సినిమా హక్కులు తీసుకోమని దిల్ రాజుని అడిగితే ఆయన వద్దనేశారట. దిల్ రాజు నో చెప్పేసరికి ఇక 'లై' చిత్రాన్ని అన్ని ఏరియాలలో అమ్మేసి... నైజాంలో మాత్రం అభిషేక్ పిక్చర్స్ ద్వారా పంపిణీకి సన్నాహాలు చేసుకుంటున్నారు నిర్మాతలు.

మరి దిల్ రాజు అంత మంచి సబ్జెట్ తో తెరకెక్కతున్న 'లై' చిత్ర హక్కులు వదులుకోవడానికి నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డితో ఉన్న చిన్న చిన్న విభేదాల కారణంగానే 'లై' చిత్ర హక్కులు వద్దన్నాడనే టాక్ వినబడుతుండగా... మరోపక్క 'లై' చిత్రం విడుదలయిన రోజు మరో రెండు చిత్రాలు కూడా విడుదల అవడంతో 'లై' చిత్రానికి థియేటర్స్ దొరక్క ఇబ్బంది పడాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతోనే దిల్ రాజు 'లై' హక్కులను తీసుకోలేదని చెబుతున్నారు.

Dil Raju Not Interested on Lie Movie Distribution Rights:

Lie Movie Nizam Distribution Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs