Advertisement
Google Ads BL

కాజల్ ఇలా... స్పందించింది!


టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తుంది. ఏ టైములో ఎవరికీ నోటీసులు అందుతాయో తెలియక సినిమా సెలబ్రిటీస్ అంతా హడలి చస్తున్నారు. ఒక పక్క సిట్ అధికారులు 12  మంది సెలబ్రిటీస్ ని విచారణ చేస్తున్నప్పటికీ టాలీవుడ్ లో డ్రగ్స్ దందా ఒక కొలిక్కి రాకుండా పోలీసులకు సవాల్ విసురుతుంది. అకున్ సబర్వాల్ టాలీవుడ్ కి ఒక విలన్ లాగా కనబడుతున్నాడు. అకున్ ఆద్వర్యంలోని సిట్ అధికారులు సినిమా వాళ్ళకి సీరియల్ క్రైం త్రిల్లర్ మూవీని చూపిస్తున్నారు. అయినా డ్రగ్స్ వ్యాపారం మాత్రం ఇంకా జరుగుతూనే వుంది.

Advertisement
CJ Advs

తాజాగా కాజల్ అగర్వాల్ మేనేజర్ ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవడం తీవ్ర సంచలనం అయ్యింది. కాజల్ ప్రస్తుత మేనేజర్ రోనీని పోలీసులు డ్రగ్స్ వ్యవహారంలో ఆధారాలతో సహా రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు. అయితే ఈ రోనీ గతంలో రాశి ఖన్నా, లావణ్య త్రిపాఠీలకు కూడా మేనేజర్ గా పనిచేశాడు. ఇక ఇప్పుడు కాజల్ కి మేనేజర్ గా వ్యవహరిస్తున్న రోనీ, కాజల్ తో క్లోజ్ గా ఉంటాడని... ఆమెకి బాగా పరిచయస్తుడని ప్రచారంజరుగుతుంది.

ఇది విన్న కాజల్ సోషల్ మీడియాలో రోనిపై తన స్పందన తెలియజేసింది.మేనేజర్ రోనీకి తనకు పర్సనల్ సంబంధం అంటూ ఏం లేదని కేవలం... వృత్తిపరమైన స్నేహం తప్ప, ఎవరితోనూ అంతకు మించిన సంబంధాలు నాకు లేవు... అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది కాజల్‌ అగర్వాల్‌. ఇకనుండి నా విషయాలన్నీ నా తల్లిదండ్రులే చూసుకుంటారు అని కూడా చేబుతుంది.

Kajal Agarwal Reaction in Social Media!:

My parents have always managed my career and with everyone else from my industry, I share an extremely professional, cordial relationship.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs