ఎన్టీఆర్ మంచి జోరుమీదున్నాడు. ఒకవైపు 'జై లవ కుశ', మరో వైపు 'బిగ్ బాస్'లతో బిజీ బిజీ. ఇక 'జై లవ కుశ' విషయంలో కూడా టైటిల్‌ని, లోగోను, మోషన్ లోగోను తొందరగానే రివీల్ చేశారు. ఆ తర్వాత ఒకట్రెండు ఫస్ట్‌లుక్స్ వదిలారు. ఇటీవలే 'జై' పాత్రకు సంబంధించిన టీజర్ విడుదలై అద్బుతమైన స్పందనను రాబట్టుకుంటోంది. అదే సమయంలో ఈ చిత్రంలోని మిగిలిన రెండు క్యారెక్టర్లయిన 'లవ, కుశ'ల టీజర్లను కూడా మరో రెండు మూడు వారాలలో రిలీజ్ చేయనున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వేగంగా పూణెలో బాలీవుడ్ మూవీ 'రామ్‌లీలా' చిత్రాన్ని షూట్ చేసిన భవంతిలోనే ఈ చిత్రాన్ని తీస్తున్నారు. మరో పక్క ఈ చిత్రానికి సంబంధించిన ఆరు పాటలకు దేవిశ్రీప్రసాద్ ఎప్పుడో ట్యూన్స్ రెడీ చేశాడు. త్వరలో రికార్డింగ్ చేయనున్నారు. ఆగష్టు 12వ తేదీ సాయంత్రం ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్నారట. శనివారం రాత్రి కావడంతో ఈ తేదీనీ ఫిక్స్ చేశారట. ఆడియో వేడుక నాటికి టాకీపార్ట్‌ని పూర్తి చేయలనే ఉద్దేశ్యంలో ఉన్నారు.
ఆ తర్వాత పాటల చిత్రీకరణ జరపనున్నారు. సెప్టెంబర్ 21న 'జై లవ కుశ'ను ధియేటర్లలోకి తెచ్చేందుకు సన్నద్దమవుతున్నారు. ఆడియో విడుదల రోజు నుంచే భారీ ప్రమోషన్ కార్యక్రమాలను థియేటికల్ ట్రైలర్లను కూడా రిలీజ్ చేయనున్నారని సమాచారం.