'ఫిదా' చిత్రం గురించి నిన్నటివరకు అంతన్నారు... ఇంతన్నారు కానీ ఇప్పుడేమో కలెక్షన్స్ తగ్గుతున్నాయంటున్నారు. గత శుక్రవారమే విడుదలైన 'ఫిదా' చిత్రం పాజిటివ్ టాక్ తో మంచి క్లాస్ మూవీగా బాక్సాఫీసు కలెక్షన్స్ కొల్లగొడుతూ దూసుకుపోతుంది. వీకెండ్ లో అన్ని రకాలుగా కలెక్షన్స్ కొల్లగొట్టిన 'ఫిదా' కి ఇప్పుడు.. కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నట్టు చెబుతున్నారు. ఈ చిత్రం ఎక్కువగా మల్టిప్లెక్స్ ఆడియన్స్ కే నచ్చుతుందని బిసి సెంటర్స్ లో వీకెండ్ లో బాగానే ఉన్నా ఇప్పుడు వీక్ డేస్ లో కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నట్టు చెబుతున్నారు.
'ఫిదా' చిత్రంలో భానుమతి కేరెక్టర్ లో సాయి పల్లవి తెలంగాణ యాసలో, పల్లెటూరి అమ్మాయిలా ఎంతగా రెచ్చిపోయినప్పటికీ ఈచిత్రం పూర్తి క్లాస్ టచ్ తోనే తెరకెక్కిందని.... బిసి సెంటర్స్ లో ఈ చిత్రానికి రిపీట్ ఆడియన్స్ రారని చెబుతున్నారు. అందుకే మాస్ సెంటర్స్ లో 'ఫిదా' కి కలెక్షన్స్ పడిపోతున్నాయంటున్నారు. మరి డైరెక్టర్ శేఖర్ కమ్ముల చిత్రాలకు క్లాస్ టాక్ ఉన్నప్పటికీ బిసి సెంటర్స్ లో కలెక్షన్స్ కాస్తంత బాగానే ఉండేవి. కానీ ఇప్పుడు 'ఫిదా' మాత్రం అలా కాదంటున్నారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మాస్ ఏరియాల్లో 'ఫిదా' కలెక్షన్స్ సోమవారం అంతంత మాత్రంగానే ఉన్నాయి అంటున్నారు.
ఇక 'ఫిదా' సెకండ్ హాఫ్ లో మరి స్లోగా ఉండడంతో మాస్ ఆడియెన్సుకి ఎక్కదని.... క్లాస్ ఆడియన్స్ అయితే సర్దుకుపోగలరు గాని బిసి సెంటర్స్ ఆడియన్స్ కి సరిగ్గా ఎక్కదనే టాక్ ముందు నుండి ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ మాత్రం కామెడీ తో కొట్టేసిందని కూడా చెబుతున్నారు. మరి చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా ప్రయోజనం లేదనే కామెంట్స్ అయితే ప్రస్తుతం వినబడుతున్నాయి.