Advertisement
Google Ads BL

సెన్సార్‌ బోర్డ్ మరో కొత్త నిబంధన విధించింది..!


మన సినిమాలలో కొన్నిసార్లు ఫోన్‌నెంబర్‌ చెప్పే సీన్స్‌ వస్తుంటాయి. ఇంతకు ముందు ఇలా సినిమాలలో ఫోన్‌ నెంబర్ల ప్రస్తావన సమయంలో దర్శకులకు ఏ నెంబర్‌ బాగుంటే, ఏది నచ్చితే అది చెప్పేసేవారు. దాని వల్ల అసలు ఆ నెంబర్‌ని కలిగి ఉన్నవారికి ఎన్నో ఇబ్బందులు,అనవసరమైన కాల్స్‌, మేసేజిలు వచ్చేవి. నాగార్జున-పూరీ జగన్నాథ్‌ల 'శివమణి', తమిళం, తెలుగు, హిందీలలో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ 'గజిని', 'ఒక్కడు'చిత్రంలో ట్రాన్స్‌పోర్ట్‌ అధికారిగా ధర్మ వరపు సుబ్రహ్మణ్యం ఉపయోగించే ఫోన్‌ నెంబర్ల వల్ల పలువురు ఇబ్బందుల పాలయ్యారు. 

Advertisement
CJ Advs

తాజాగా ఈ విషయంలో సెన్సార్‌ బోర్డ్‌ తాజాగా నిబంధనలు విధించింది. ఏదైనా నెంబర్‌ని సినిమాలో వాడితే ఆ నెంబర్‌ ఫోన్‌ కలిగిన వారి నుంచి అనుమతి పత్రం తీసుకోవాలని కండీషన్‌ విధించారు. లేదా ఫోన్‌ నెంబర్‌ తమ యూనిట్‌ వారిది లేదా వారి సంబంధీకులదైనా సరే ఎన్‌ఓసీని తప్పని సరి చేసింది. దీంతో పలు తలనొప్పులు, ఇబ్బందులు తొలుగుతాయని సెన్సార్‌ భావిస్తోంది. మొత్తానికి ఈ నిబంధన ఎవ్వరికీ నచ్చకపోవడం, అభ్యంతరం చెప్పడానికి వీలు కాని సరైన నిర్ణయమని చెప్పాలి...! 

Censor Board Apply New Testament:

Censor Board Apply New Testament on use mobile numbers in movies.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs