Advertisement
Google Ads BL

డ్రగ్స్ పై మరింత బిగుస్తున్న ఉచ్చు...!


ఓవైపు టాలీవుడ్‌ని డ్రగ్స్‌ ఉచ్చు బిగుస్తున్న సమయంలోనే తరుణ్‌, శ్యాంకె నాయుడు, పూరీ, తరుణ్‌, నవదీప్‌ల విచారణలో సిట్‌ అధికారులకు మరింత మంది డ్రగ్స్‌ వాడే, సరఫరా చేసే టాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చినట్లు తాజా సమాచారం. ఇక త్వరలోనే మరింత మందికి నోటీసులు ఇస్తామని అకుల్‌ సబర్వాల్‌ ప్రకటించడం, తనకు ప్రాణభయం లేదని చెప్పి తమపై విమర్శలు చేస్తున్న రాంగోపాల్‌ వర్మ, ఆర్‌.నారాయణమూర్తిలతో పాటు కోర్టులో పిటిషన్‌ వేసిన చార్మికి కూడా సబర్వాల్‌ మంచి కౌంటర్‌ ఇచ్చాడు. 

Advertisement
CJ Advs

పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు పబ్‌ వ్యాపారాలతో, గోవాకి, ఇతర దేశాలకు వెళ్లి అక్కడి డ్రగ్స్‌ మాఫియాతో, డీలర్లతో పెట్టుకున్న లింక్‌లు, కాల్‌డేటాలు, వారు పిలుచుకునే కోడ్‌ భాష, ముద్దుపేర్లు జీషన్‌ అలీ తయారు చేసే డ్రింక్‌కి ఉన్న కోడ్‌ పేరుతో పాటు ఆవులిస్తే పేగులు లెక్కబెడుతున్నారు అధికారులు. ఇక ఇలాంటి కేసుల విషయంలో విమర్శలు మామూలేనని, వాటిని పట్టించుకోవద్దని సబర్వాల్‌కి స్వయాన డీజీపీ అనురాగ్‌ శర్మ దూసుకెళ్లమని కేసీఆర్‌ మాటగా హామీ ఇచ్చేశాడు. 

పంజాబ్‌, గోవాల తర్వాత హైదరాబాద్‌కి డ్రగ్స్‌ అడ్డాగా వస్తున్న చెడ్డ పేరు పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా ఉంది. పూరీని, రవితేజను, నవదీప్‌ని, ఈ ముగ్గురిని ప్రత్యేకకోణంలో చూస్తున్నారు. తరుణ్‌, నవదీప్‌ పబ్బులలో జరిగే ఈ దందా, అవకాశాలు లేక దీని ద్వారా నాలుగురాళ్లు సంపాదించాలని వారు చేసిన ఈ వ్యవహారంలో తరుణ్‌, నవదీప్‌ల నుంచి టాలీవుడ్‌ పెద్దతలకాయల పేర్లు బయటికి వచ్చాయట. వారికి గోవా, ఆఫ్రికాల నుంచి నేరుగా డ్రగ్స్‌ లభించేవని, డ్రగ్స్‌ మాఫియాతో, డీలర్లతో వారికి ప్రత్యేక సంబంధాలు ఉన్నాయని కూడా అంటున్నారు. 

ఇక కాజల్‌ మేనేజర్‌ రోని ఉదంతం మరో సంచలనానికి కారణమైంది. తన ఇంటి నుంచి టాస్క్‌ఫోర్స్‌ భారీ ఎత్తున డ్రగ్స్‌, గంజాయిని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు.దీంతో ఈ కేసు మరింత బలపడుతోంది. రోనీ కాజల్‌కే కాదు... రాశిఖన్నా, లావణ్య త్రిపాఠిలకు కూడా మేనేజర్‌గా వ్యవహరించడం, ఇంట్లోనే రెడ్‌ హ్యాండెడ్‌గా డ్రగ్స్‌ దొరకడంతో సినీ జనాలు వణికిపోతున్నారు. 

Akun Sabharwal Meets DGP Anurag Sharma:

<span>The drugs case issue of threat calls to Akun Sabharwal is being take-up very seriously and even Anurag Sharma assured complete security to Akun Sabharwal.</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs