Advertisement
Google Ads BL

'బాలకృష్ణుడు' భలే వున్నాడు..!!


ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మొదలు కథలనే నమ్మి సినిమాలు చేస్తున్న హీరో నారా రోహిత్. కథా బలం ఉన్న సినిమాల్లో నటిస్తున్న నారా రోహిత్ కి సినిమా ఫలితంతో పని లేకుండా కెరీర్ ని చక్కబెట్టుకుంటున్నాడు. కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ విభిన్న పాత్రలకు ఓటేసే నారా రోహిత్ చేతిలో ఇప్పుడు బోలెడన్ని సినిమాలున్నాయి. మొన్నటికి మొన్న పెరిగిన గెడ్డం, లుంగీతో రఫ్ లుక్ లో 'కథలో రాజకుమారి' అంటూ షాకిచ్చాడు. ఆ చిత్రంలో నారా రోహిత్ లుక్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చేసింది. అయితే తర్వాత వచ్చిన లుక్ లో రోహిత్ మంచి స్టైలిష్ గానే కనిపించాడు. 

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు తాజాగా తన కొత్త సినిమా 'బాలకృష్ణుడు' తో మళ్ళీ ఇప్పుడొక షాక్ ఇచ్చాడు. అసలు ఈ పోస్టర్ లో సడన్ గా చూస్తే గనక మనకు నారా రోహిత్ కనబడడు. అంత కొత్తగా, ఆ లుక్ లో రోహిత్ చాలా డిఫ్రెంట్ గా కనిపిస్తున్నాడు మరి. ఇప్పటివరకు రోహిత్ నటించిన సినిమాల్లో రోహిత్ బాగా లావుగా, బొద్దుగా ఒక భీముడి మాదిరి కనిపించేవాడు. కానీ ఇపుడు బాగా వర్కౌట్స్ గట్రా చేసి చాలా స్లిమ్ అవడం... ఈ 'బాలకృష్ణుడు' పోస్టర్ లో బాగా సన్నగా కొత్తగా రోహిత్ లుక్ ఉంది. ఫుల్ గా బాడీని ఎక్సపోజ్ చేస్తూ రంగు రంగుల కలర్స్ తో రోహిత్ మాత్రం సిక్స్ ప్యాక్ బాడీతో భలే కనిపిస్తున్నాడు. 

కొత్త దర్శకుడు పవన్ మల్లెల డైరెక్షన్ లో తెరకెక్కే ఈ చిత్ర టైటిల్ 'బాలకృష్ణుడు' కూడా ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. ఎందుకంటే నందమూరి బాలకృషకి రోహిత్ రిలేటివ్ కాబట్టి బాలకృష్ణ పేరు మీద తన సినిమా టైటిల్ పెట్టుకోవడంతో నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ ని తన మీదకి తిప్పేసుకున్నాడు రోహిత్. మరి అభిమానం ఉంటే చాలదు టైటిల్ తో కూడా పడగొట్టొచ్చని రోహిత్ మాత్రం సూపర్ స్కెచ్ వేసాడంటున్నారు.

Nara Rohit in Balakrishnudu Movie:

Nara Rohit Birthday Special: Balakrishnudu Movie first Look released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs