Advertisement
Google Ads BL

అఖిల్‌ పై విమర్శలు..!


అక్కినేని అఖిల్‌ తన తండ్రి మాట వినకుండా మొదటి చిత్రంలోనే లోకాన్ని కాపాడే బాద్యతలను తన భుజాలకు ఎత్తుకున్నా కూడా తన పేరునే టైటిల్‌గా పెట్టుకున్న 'అఖిల్‌' భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో ఆతడిని మరలా రీలాంచ్‌ చేసేందుకు ఆయన తండ్రే నాగార్జుననే తమ సొంత బేనర్‌ అన్నపూర్ణ స్టూడియస్‌ ప్రొడక్షన్‌లో ఇంటెలిజెంట్‌ డైరెక్టర్‌, 'మనం' ఫేమ్‌ విక్రమ్‌.కె.కుమార్‌తో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్‌ కె.కుమార్‌ 'ఇష్క్‌' తర్వాత చేస్తున్న పూర్తి లవ్‌స్టోరీ ఇదని తెలుస్తోంది.

Advertisement
CJ Advs

కాగా ఈ చిత్రం షూటింగ్‌ స్పాట్‌లోని ఓ ఫొటో బయటకు వచ్చింది. అఖిల్‌ కెమెరా ముందు కూర్చొని కెమెరా వ్యూ ఫైండర్‌లో చూస్తున్నాడు. సామాన్యంగా నాగార్జున వంటి సీనియర్లు కూడా తమ షాట్‌ ఎలా ఉండాలి? షాట్‌ ఎలా వచ్చింది? అనేవి పక్కన ఉండే మానిటర్‌లో చూసుకుంటారు. క్రియేటివ్‌ దర్శకుడైన విక్రమ్‌ కె.కుమార్‌, సినిమాటోగ్రాఫర్‌గా పి.ఎస్‌.వినోద్‌ వంటి వారు పనిచేస్తుండగా, అఖిల్‌కి అంత అవసరం లేదు. వారు చెప్పినట్లు నటిస్తే చాలు రిజల్ట్‌ దాని కదే వస్తుంది. 

ఇక ఎలాగూ సినిమా ఫైనల్‌ అవుట్‌పుట్‌, ఎడిటింగ్‌, రీషూటింగ్‌ల విషయంలో నాగార్జున ఎలాగూ ఉంటాడు.కాబట్టి రెండో చిత్రానికే ఇలా టెక్నీషియన్ల విషయంలో వేలు పెట్టడం సరికాదని, అదే అతని తొలి చిత్రాన్ని ముంచిందనే విమర్శలు వస్తున్నాయి. కావాలని చేసిన, తమాషాకి చేసినా అఖిల్‌పై సోషల్‌ మీడియాలో మాత్రం నెగటివ్‌ కామెంట్స్‌ పడుతున్నాయి..! 

Criticisms on Akkineni Akhil:

Akkineni Akhil second movie update... Negetive comments on Akhil in social media.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs