Advertisement
Google Ads BL

'సాహో' తర్వాత రూట్‌ మార్చనున్న డార్లింగ్‌!


యంగ్‌ రెబల్‌ స్టార్‌కి ముందు నుంచి మాస్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఇక ఆయన కూడా 'మిర్చి, బాహుబలి'లతో దానిని వందలరెట్లు పెంచుకున్నాడు. ఇక ప్రభాస్‌కి లేడీస్‌లో, ఫ్యామిలీ ఆడియన్స్‌లో క్రేజ్‌ తీసుకొచ్చిన చిత్రాలలో 'డార్లింగ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌'లు ఎంతో దోహదం చేశాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్‌ తనకు పెరిగిన ఇమేజ్‌, క్రేజ్‌ దృష్ట్యా 'సాహో' చేస్తున్నాడు.ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైనా ప్రభాస్‌ ఇంకా షూటింగ్‌లో జాయిన్‌ కాలేదు. ఈ చిత్రం వచ్చే వేసవిలో రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. 

Advertisement
CJ Advs

దీని తర్వాత నెక్ట్స్‌ ఏంటి? అనే విషయంలో సస్పెన్స్‌కొనసాగుతూనే ఉంది. కరణ్‌ జోహార్‌ నిర్మాతగా, ఆయన దర్శకత్వంలోనే ఓ చిత్రం చేస్తాడని, సాజిద్‌ నదియా వాలతో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇంతలో కొరియోగ్రాఫర్‌ కమ్‌ డైరెక్టర్‌ ప్రభుదేవా తాను ప్రభాస్‌తో ఓ చిత్రం చేస్తానని చెప్పాడు. కానీ తాజా సమాచారం ప్రకారం ప్రభాస్‌ మాత్రం ముందుగా అనుకున్నట్లుగానే 'జిల్‌'తో మంచి టెక్నీషియన్‌గా, స్టైలిష్‌ మేకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాధాకృష్ణతోనే ఆ తర్వాతి చిత్రాన్ని కూడా యూవీ క్రియేషన్స్‌ బేనర్‌లోనే చేస్తాడని వార్తలు వస్తున్నాయి. 

ఇది కన్‌ఫర్మ్‌ అని కూడా విశ్వసనీయ సమాచారం. ఇక రాధాకృష్ణతో చేసే చిత్రం పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా 1970-80ల మద్యకాలంలో జరిగే ప్రేమ కథ అని తెలుస్తోంది. అదే ప్రభాస్‌ 'డార్లింగ్‌' తర్వాత చేయబోయే పూర్తి నిడివి ప్రేమకధా చిత్రం ఇదే అవుతుంది. ఈ స్టోరీ యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌తో ఉంటుందని, దీనిని వచ్చే దీపావళికి ప్రారంభిస్తారని సమాచారం. 

Prabhas Next Movie Update After Saaho:

Young Rebel star Prabhas next movie with director Radha Krishna.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs