Advertisement
Google Ads BL

నవదీప్‌ పై బిగుస్తున్న ఉచ్చు..!


తనకు ముందుగా కొందరు సినీ ప్రముఖులను ఆల్‌రెడీ సిట్‌ అధికారులు ప్రశ్నించడంతో వారిని ఏమేమి ప్రశ్నలు అడిగారు అని తెలుసుకున్న నవదీప్‌ అదికారులు అడుతున్న ప్రశ్నలన్నింటికి...నో అనో లేదా తెలియదు అనో సంక్షిప్తంగా సమాధానాలు చెబుతుండటంతో అధికారులు చాలా విసుగుతెత్తుతున్నారని, ఉదయం నుంచి మద్యాహ్నం వరకు తనకు తెలిసిన ప్రశ్నలనే సంధిస్తూ వచ్చిన అధికారులు జీషన్‌ అలీ,తరుణ్‌లు ఇచ్చిన ఆధారాలను మధ్నాహం నుంచి నవదీప్‌పై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. 

Advertisement
CJ Advs

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో పూరీ, నవదీప్‌లది కీలక పాత్రగా అధికారులు భావిస్తున్నారు. తరచుగా విదేశాలకు, గోవాలకు వెళ్తుండటంతో అంతర్జాతీయ డ్రగ్స్‌ సరఫరా మాఫియా ప్రముఖులతో వారికి ప్రత్యక్ష సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు. ముఖ్యంగా నవదీప్‌ ఈమద్య నటన కంటే పార్టీలు, ఈవెంట్స్‌ని బాగా నిర్వహిస్తూ ఉండటం, పలు పార్టీలలో ప్రత్యేకమైన అతిధులు కోరితే కాక్‌టైల్‌తో కలిపిన డ్రగ్స్‌ ఉండే ద్రవాన్ని ప్రత్యేకంగా సరఫరా చేసేవాడనే నిజాలు అధికారులకు ఆధారాలతో సహా లభించాయి. గతేడాదిలోనవదీప్‌కి చెందిన గెస్ట్‌హౌస్‌లో పర్మిషన్‌ లేకుండా సప్లై చేస్తున్న మద్యం కేసులో రైడ్‌ చేసి ఓ వక్తిని కూడా అరెస్ట్‌ చేశారు. 

మరోవైపు కేవలం నవదీప్‌, తరుణ్‌లకు చెందిన పబ్బులలోనే ఈ విధమైన డ్రగ్స్‌ కలిపిన ప్రత్యేక పానీయం ఆ డ్రింక్‌ కోడ్‌ని అడిగిన వారికి భారీరేటును ప్రత్యేక రూంలలో సప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తరుచుగా విదేశాలకు. గోవాలకి వెళ్లే నవదీప్‌ అక్కడి డ్రగ్స్‌ సరఫరా దారులతో నేరుగా పరిచయాలు, ఇంటర్నేషనల్‌ సెల్‌నెంబర్లు, తరుచుగా అతని పబ్‌కి గోవా నుంచి డ్రగ్స్‌ సప్లై కావడం, డ్రగ్స్‌ వినియోగంలోనే కాదు.. జీషన్‌ అలీతో ఈ ప్రత్యేక డ్రింక్‌ తయారు చేయించి, పార్టీలు, ఈవెంట్స్‌లో పంపిణీ చేయడం వంటి పలు తీవ్రమైన ఆరోపణలు వస్తుండటంతో మధ్యాహ్నం నుంచి స్వయాన అకుల్‌ సబర్వాలే నేరుగా రంగంలోకి దిగాడని సమాచారం. 

Navdeep Drugs Case Interrogation Update:

Tollywood Actor Navdeep drugs case interrogation today and reveal so many things.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs