Advertisement
Google Ads BL

డ్రగ్స్ కేసులో ఛార్మి రూటు మార్చింది..!


డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్నసెలబ్రిటీస్ ఒక్కొక్కరుగా తమకు కేటాయించిన తేదీల్లో సిట్ ముందు హాజరవుతున్నారు. వీరిని ఎక్సయిజ్ శాఖ  సుదీర్ఘంగా విచారిస్తుంది. విచారణలో భాగంగా రకరకాల ప్రశ్నలతో వారిని తికమక పెట్టడమే కాకుండా వారు ఇంతకుముందు డ్రగ్స్ వాడారో లేదో అని నిర్దారణ చేసుకోవడానికి ఒక డాక్టర్ పర్యవేక్షణలో వారియొక్క గోళ్ళని, వెంట్రుకలని, రక్త నమూనాలను సేకరించి మరీ బయటికి పంపిస్తుంది. ఇక డాక్టర్స్ అవన్నీ సేకరించి ల్యాబ్ కి పంపి వారు ఇప్పటివరకు డ్రగ్స్ వాడారా... ఇప్పుడు వాడుతున్నారా అనేవాటిని సిట్ అధికారులకు తెలియజేస్తారు. 

Advertisement
CJ Advs

మరి ఏ ఒక్కరైనా ఖచ్చితంగా ఇలా తమ బ్లడ్ శాంపిల్స్ ని, గోళ్ళని, వెంట్రుకలని ఇవ్వాల్సిందే. మరి ఇదంతా విచారణలో ఒక భాగమే అని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇక ఇప్పటివరకు హాజరైన పూరి, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్ లు ఇలా తమ శాంపిల్స్ ని ఇచ్చారు. ఇక సోమవారం నవదీప్ తో విచారణ చేపట్టింది సిట్. అయితే ఈకేసులో నోటీసులు అందుకున్న ఛార్మి మాత్రం ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయించింది. ఛార్మి ఈ కేసులో మరో రెండు రోజుల్లో సిట్ ముందు విచారణకు హాజరుకావాల్సి వుంది. ఇంతలోనే ఛార్మి హైకోర్టులో ఈ కేసులో సిట్ విచారణ తీరు సరిగా లేదని ఆమె తన పిటిషన్ లో పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. 

అయితే ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3 ప్రకారం.. బలవంతంగా రక్త నమూనాలను సేకరిస్తున్నారని, తన లాయర్ ని కూడా తన వెంట తీసుకువచ్చే వెసులుబాటు కల్పించాలని ఛార్మి తన పిటిషన్ లో కోరారు. ఇక ఈ పిటిషన్ సోమవారం మధ్యాహ్నం లోపే విచారణకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ లెక్కన ఛార్మి సిట్ అధికారులకు ఒకింత భయపడే ఇలా చేసిందని అంటున్నారు. ఆమె ఏ తప్పు చెయ్యకపోతే ఇలా కోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఏమొస్తుందని అంటున్నారు. ఛార్మి డ్రగ్స్ తీసుకుందని.... ఆమెను డ్రగ్స్ కేసులో విచారణ జరిపేటప్పుడు ఎలాంటి వివరణ ఇవ్వాలో తన స్నేహితుడు పూరి జగన్నాధ్.. ఛార్మికి ట్రైనింగ్ ఇచ్చినట్టు కూడా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.

Charmi Files Writ Petition Against SIT!:

Charmi approached High Court today filing a writ petition demanding on only women officials should shoot questions at her at Abkari Bhavan and that too in the presence of her advocate.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs