Advertisement
Google Ads BL

మహేష్ పాత్ర పై కొరటాల క్లారిటీ..!


శ్రీమంతుడు కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. మహేష్ - కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అదే కాంబినేషన్ లో ఇప్పుడు మహేష్ బాబు పొలిటీషియన్ గా భరత్ అను నేను చిత్రం తెరకెక్కుతుంది. కొరటాల శివ తన సినిమాలలో ఎక్కువగా సమాజానికి ఎదో ఒక మెసేజ్ ఉండేలా చూసుకుంటాడు. ఇప్పుడు మహేష్ తో తెరకెక్కిస్తున్న భరత్ అను నేను చిత్రం కూడా ఇలా సమాజానికి ఉపయోగపడే కాన్సెప్ట్ తోనే తెరకెక్కుతోందని అనుకుంటున్నారు. కానీ మొదటి నుండి ఈ చిత్రం పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ లోనే ఉండబోతుందని ప్రచారమైతే జరుగుతుంది.

Advertisement
CJ Advs

అంటే కొరటాల ఈసారి పొలిటికల్ గా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడా? మరి ముఖ్యమంత్రిగా మహేష్ ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నాడో అనే క్యూరియాసిటీ మాత్రం మహేష్ అభిమానుల్లో అంతకంతకు ఎక్కువైపోతోంది. మరి ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నకు సమాధానంగా కొరటాల శివ ఏం చెబుతున్నాడో చూడండి. ఈ విషయమై కొరటాల స్పందిస్తూ భరత్ అను నేను సినిమా ఏ పొలిటికల్ పార్టీని గాని, లీడర్ ని గాని మనసులో పెట్టుకుని రూపొందిస్తున్నసినిమా కాదని.... ఇందులో ఎటువంటి సెటైరికల్ డైలాగ్స్ ఉండవని చెబుతున్నాడు.

అయితే  ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్, ఎమోషన్స్ కు ఎక్కువ ప్లేస్ ఈ సినిమాలో ఉండబోతుందని క్లారిటీ ఇచ్చాడు. ఇక మహేష్ సరసన బాలీవుడ్ భామ కైరా అద్వానీ నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తుండగా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు.

Koratala Siva about Mahesh Role in Bharat Anu Nenu:

Director Koratala Siva Talks About Bharat Anu Nenu Movie Story
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs