Advertisement
Google Ads BL

హీరో కన్నా హీరోయిన్ నే హైలెట్ అయ్యింది..!


వరుణ్ తేజ్ - సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా చిత్రం ఈ శుక్రవారమే విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. శేఖర్ కమ్ముల సినిమాలు ఎప్పుడూ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూనే ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదని ఈ ఫిదా చిత్రం మరో మారు రుజువు చేసింది. లాంగ్ గ్యాప్ తీసుకుని శేఖర్ కమ్ముల ఒక చక్కటి ప్రేమకథని ప్రేక్షకులకు అందించాడు. ఇప్పుడా ప్రేమ కథ కుర్రకారు మతులు పోగెట్టేస్తుంది. ఆ సినిమాలో నటించిన సాయి పల్లవి నటనకు అందరూ మంత్ర ముగ్దులైపోతున్నారు. 

Advertisement
CJ Advs

అసలు ఆమె నటనకు ఎంతెలా ఫిదా అవుతున్నారు అంటే సోషల్ మీడియా అంతటా ఆమె గురించే కామెంట్స్ పెడుతున్నారు.... అంటే సాయి పల్లవి నటనకు యువత ఎంతగా కనెక్ట్ అయ్యారో అనిపిస్తుంది. సాయి పల్లవి మొహం మీద మొటిమలు ఉంటేనేమి, ఆమె అందంగా లేకుంటేనేమి, ఆమె నటనకు, డాన్స్ లకు మేమంతా ఫిదా అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసున్నారు. మళ్లీ మళ్లీ ఫిదా చూడాలనంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు కూడా.. ఇంత పాజిటివ్, ఎనర్జీ టాక్ తో దూసుకుపోతున్న ఫిదా చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది... అలాగే క్లాస్ మూవీ మాత్రమే కాదు మంచి లవ్ స్టోరీ కూడా ఉండడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా కి కనెక్ట్ అవుతున్నారు. ఇక ఓవర్సీస్ లో శేఖర్ కమ్ముల సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణే ఉంటుంది.

ఇక ఇప్పుడు ఫిదా పాజిటివ్ టాక్ తో అక్కడ కూడా కోట్లు కొల్లగొడుతుందని చెబుతున్నారు. ఇప్పటికే యూఎస్ లో 6 లక్షల డాలర్ల వరకు కలెక్ట్ చేసిన ఈ చిత్రం ఏపీ, తెలంగాణల్లో కలిపి ఈ రెండు రోజుల్లో దాదాపు ఆరు కోట్ల పైనే షేర్ వసూలైనట్టు చెబుతున్నారు.మరి గత చిత్రాలకు వరుణ్ కి మంచి పేరొచ్చినప్పటికీ ఇప్పుడు మాత్రం ఫిదా తో ఒక కమర్షియల్ హిట్ పడినట్లే. ఇక ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో ఈ చిత్రానికి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కొన్ని థియేటర్లు పెంచే యోచనలో ఉన్నారని సమాచారం.

Sai Pallavi Rocks in Fidaa:

Sai Pallavi in 'Fidaa' movie performance and dance, we are all fidaa and racha racha in social media. Two telugu states collections nearly 6 crores or above shares.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs