Advertisement
Google Ads BL

కొడుకు కొరకు బ్రెయిన్‌ని వాడిన ప్రొడ్యూసర్!


అల్లు వారి చిన్న అబ్బాయ్ అల్లు శిరీష్‌ హీరోగా ఎంటరై ఏళ్లు గడుస్తున్నా సరైన బ్రేక్‌ ఇప్పటి వరకు రాలేదు. ఏదో 'శ్రీరస్తు..శుభమస్తు' చిత్రం ఓకే అనిపించింది. ఇక ప్రస్తుతం ఆయన 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' ఫేమ్‌ వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వంలో ఓ సైన్స్‌ ఫిక్షన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయనకు జోడీగా సురభి, సీరత్‌ కపూర్‌లు నటిస్తున్నారు. విఐ ఆనంద్‌ దర్శకుడు కావడంతో ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి.

Advertisement
CJ Advs

షూటింగ్‌ కూడా వేగంగా జరుగుతోంది. కేవలం అవార్డు వేడుకలకు హోస్ట్‌గా తప్ప నటనాపరంగా ఇప్పటి వరకు తనను తాను ప్రూవ్‌ చేసుకోలేకపోయిన అల్లు శిరీష్‌ ఈ చిత్రంపై గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌కి, విఎఫ్‌ఎక్స్‌లకు కూడా పని ఉండటంతో చిన్నగా వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో రావాలని భావిస్తున్నారట. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్‌ చర్చనీయాంశం అయింది. 

ఈ చిత్రం షూటింగ్‌లో ఉండగానే సన్‌ నెట్‌ వర్క్‌ వారు శాటిలైట్‌ హక్కులను ఏకంగా 4.5కోట్లకు తీసుకున్నారని సమాచారం. ఇదే నిజమైతే శిరీష్‌ కెరీర్‌లో ఇదే బెస్ట్‌ అని చెప్పాలి. దర్శకుడు విఐ ఆనంద్‌పై ఉన్ననమ్మంతో పాటు అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని ఆ రేటుకు తీసుకుంటేనే తాను చిరంజీవితో చేయబోయే 152వ చిత్రం, బన్నీ నటిస్తున్న 'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' సినిమాలను సన్‌ నెట్‌ వర్క్‌కి ఇప్పిస్తానని వాగ్దానం చేయడంతోనే ఈ చిత్రం శాటిలైట్‌ ఇంత తొందరగా, అందునా సన్‌ నెట్‌ వర్క్‌ ఆ రేటుకు ఓకే చెప్పిందని సమాచారం. మొత్తానికి మాస్టర్‌ బ్రెయిన్‌ని ఎప్పుడు? ఎక్కడ? ఎలా వాడాలో అరవింద్‌కి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదనే చెప్పాలి.

Allu Sirish’s Untitled Film Bagged by Sun Net work?:

The Sun Network has reportedly bagged the satellite rights of the Allu Sirish starrer that has not been given a title yet.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs