Advertisement
Google Ads BL

'బిగ్‌ బాస్‌'లో అసహనం పెరిగిపోతోంది..!


తెలుగు 'బిగ్‌ బాస్‌' తలాతోకా లేకుండా, దశ, దిశాలేని అనవరసపు గొడవలతో నవ్వుల పాలవుతోంది. ఇక ఏకంగా 70రోజులు బిగ్‌ బాస్‌ హూస్‌లో ఉండాల్సిన పార్టిసిపెంట్స్‌ కేవలం వారం తిరగకుండానే అసహనం ప్రదర్శిస్తున్నారు. స్మోకింగ్‌ రూమ్‌లోకి ఒకరి కంటే ఎక్కువ మంది వెళ్లినందుకు బిగ్‌ బాస్‌ పనిష్‌మెంట్‌ ఇచ్చాడు. సిగరెట్లను ఇవ్వడం ఆపేశాడు. దాంతో స్మోకింగ్‌ అలవాటున్న పార్టిసిపెంట్స్‌ బిగ్‌ బాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

తాము గతిలేక బిగ్‌ బాస్‌కి రాలేదని, స్మోకింగ్‌లో కూడా ఇలా ప్రవర్తించడం స్టుపిడిటీ అని శివ బాలాజీ కోపం వ్యక్తం చేశాడు. దీనికి దన్‌ రాజ్‌, సమీర్‌లు మద్దతు పలికారు. తాము బిగ్‌ బాస్‌ ఇచ్చే టాస్క్‌లన్ని ఎంతో క్రమిశిక్షణతో చేస్తున్నామని, పనిష్‌ మెంట్‌లు కూడా అనుభవిస్తున్నామని, కానీ ఇంత కఠినంగా ఉండటం తట్టుకోలేమని వారు అసహనం వ్యక్తం చేశారు. ఇక వీరి విన్నపాన్ని మన్నించిన బిగ్‌బాస్‌ సిగరెట్లను అందించాడు. కానీ మరో కండీషన్‌ పెట్టాడు. ఒకరు స్మోక్‌ చేసేటప్పుడు మిగిలిన 13  మంది బాత్రూమ్‌లలో ఉండాలని నిబంధన పెట్టాడు. 

అయితే తాము సిగరెట్లు తాగుతుంటే మిగిలిన వారంతా బాత్రూమ్‌లలో ఉండటం తమకు గిల్టీగా ఉందని ధన్‌రాజు అంటున్నాడు. ఇక నుంచి బిగ్‌ బాస్‌ ఆదేశాల ప్రకారమే స్మోక్‌ రూమ్‌లోకి ఒక్కరే వెళ్లి సిగరెట్‌ కాలుస్తామని, కాబట్టి ఈ కొత్త నిబంధన సడలించాలని ఆయన బిగ్‌ బాస్‌కి రిక్వెస్ట్‌ చేశాడు. మరో వైపు శనివారం షూటింగ్‌లో బిగ్‌ బాస్‌ ఎన్టీఆర్‌ కుమారుడు అభయ్‌రామ్‌ కూడా పాల్గొన్నాడు. ఆ బుల్లి టైగర్‌ బర్త్‌డే కావడంతో షూటింగ్‌కి వచ్చాడు. మరి ఆదివారం ఈ బుల్లి టైగర్‌ బుల్లి తెరపై కనిపిస్తాడో లేదో చూడాలి..!

Intolerance is Growing in Bigg Boss Show:

Big bass punished for more than one person into the smoking room. Stopped cigarettes. Bigg Boss NTR's son Abhayram also participated in the shooting on Saturday.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs