Advertisement
Google Ads BL

నయనతార మైండ్ సెట్ మారింది!


నయనతార ఎన్ని ప్రేమ వ్యవహారాలు నడిపినా.. ఆ ప్రేమ వ్యవహారాలు పెళ్ళి వరకు వచ్చి ఆగిపోయినా కూడా  బిజీ లైఫ్ ని కంటిన్యూ చేస్తూ బాధతో కృంగిపోకుండా లైఫ్ ని చాలా చక్కగా మలుచుకుంటుంది. గతంలో శింబు, ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపిన నయనతార ఇప్పుడు కూడా డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో లవ్ లో వుంది. కానీ నయనతార ఇపుడు పెళ్ళి కోసం తొందర పడకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తుందని... కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. మధ్యలో కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా మళ్లీ తన కెరీర్ ని చక్కగా మలుచుకుని కోలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

Advertisement
CJ Advs

ఇక కోలీవుడ్ లో నయనతార డిమాండ్ చేసినంత ఇవ్వడానికి కోలీవుడ్ నిర్మాతలు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. అయితే నయనతార కి టాలీవుడ్ నిర్మాతలు ఆమె అడిగింది ఇవ్వలేక కొన్నాళ్ళు పక్కన పెట్టినా కూడా ఇప్పుడు మాత్రం ఆమె అడిగింది ఇచ్చి తమ సినిమాల్లో నటింపచేయడానికి ఆరాటపడుతున్నారు. మరి కోలీవుడ్ లో, టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న నయనతార ఇప్పుడు విగ్నేష్ తో పెళ్ళి అంటే తనకి ఆఫర్స్ రాక డిమాండ్ తగ్గే ప్రమాదం ఉన్నందునే నయనతార తన పెళ్ళి ఆలోచన పక్కనపెట్టి సినిమాల మీదే కాకుండా యాడ్స్ మీద కూడా ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు.

ఎప్పుడూ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నయనతార ఎటువంటి ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి ఆ ప్రొడక్ట్స్ ని పబ్లిసిటీ చెయ్యడానికి ఇష్టపడేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతని పాటిస్తూ నయనతార టాటా స్కై కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయి డబ్బును దండుకుంటుంది. ఇక ఈ ఒక్క బ్రాండ్ కే కాకుండా ఇంకొన్ని యాడ్స్ లో నాయతారని మనం చూడొచ్చంటున్నారు. 

Nayantara The Brand Ambassador of Tata Sky:

Nayanthara becomes the brand ambassador of Tata Sky and get hung money. And also Nayantara is going to be a few more ads.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs