టాలీవడ్ లో ఏ సెలెబ్రిటీ బయటికి వచ్చి మీడియాతో మాట్లాడినా వారిని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు గురించే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కానీ ఎవరికి తోచిన విధంగా వారు తమ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మనకెందుకులే డ్రగ్స్ విషయం మాట్లాడి మనం కూడా ఎదో ఒక వివాదంలో ఇరుక్కోవడమనే కాన్సెప్ట్ తో కొందరు సైలెంట్ అవుతున్నారు. ఇలా డ్రగ్స్ విషయంలో క్వశ్చన్ చేసిన మీడియా నుండి టాలీవుడ్ టాప్ హీరోయిన్ భలే తప్పించుకుంది.
ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా. ఇంకెవరు అక్కినేని ఇంట కోడలిగా అడుగెడుతున్న సమంత. సమంత బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న ఒక మొబైల్ షోరూం ప్రారంభోత్సవం కోసం తెలంగాణలోని హన్మకొండకు వెళ్ళింది. అక్కడ ఆ షాప్ ఓపెనింగ్ అవగానే సమంత మీడియాతో మాట్లాడింది. తన పెళ్లి నాగ చైతన్యతో అక్టోబర్ 6 , 7 తేదీల్లో చాలా సింపుల్ గా కొద్దీ మంది సన్నిహితుల మధ్యన గోవాలో జరుపుకోనున్నట్లు తెలియజేసింది.
అలాగే ఒక మీడియా ప్రతినిది టాలీవుడ్ లో జరుగుతన్న డ్రగ్స్ వ్యవరం గురించి మీరెలా ఫీలవుతున్నారని అడగ్గా నో కామెంట్ అంటూ తెలివైన సమాధానం చెప్పి తప్పించుకుంది. మరి తనకేం తెలియదు తననేం అడగొద్దు అంటూనే భారత మహిళా క్రికెట్ టీమ్ కి ఫైనల్ కు చేరుకున్న సందర్భంగా ఆల్ ద బెస్ట్ చెప్పేసింది.