Advertisement
Google Ads BL

అక్కడ 'ధృవ' రామ్ చరణే..కానీ..?


తమిళం 'తనిఓరువన్‌'కి రీమేక్‌గా తెలుగులో రామ్‌చరణ్‌, సురేందర్‌రెడ్డి, రకుల్‌ప్రీత్‌సింగ్‌, అల్లుఅరవింద్‌ల కాంబినేషన్‌లో 'ధృవ' వచ్చింది. తాజాగా ఓ యంగ్‌హీరోతో ఈ చిత్రం బాలీవుడ్‌లోకి రీమేక్‌ కానుందని వార్తలు వచ్చాయి. కానీ అంతలోనే తెలుగు 'ధృవ'నే హిందీలోకి డబ్‌ అవ్వడం చూస్తుంటే ఇక 'ధృవ'కు బాలీవుడ్‌ రీమేక్‌ ఉండదని అర్ధమవుతోంది. 

Advertisement
CJ Advs

తెలుగు స్టార్స్‌ అయిన మహేష్‌, బన్నీ, రామ్‌చరణ్‌ వంటి వారు నటించిన తెలుగు చిత్రాలు హిందీలోకి ఎప్పటి నుంచో డబ్‌ అవుతున్నాయి. అయితే వీటిని హిందీ ప్రేక్షకులు థియేటర్లలో చూడరు శాటిలైట్‌లో వస్తే మాత్రం బుల్లితెరపై, లేదా యూట్యూబ్‌లో బాగా చూస్తారు. తాజాగా అల్లుఅర్జున్‌ 'సరైనోడు' హిందీ వెర్షన్‌ కూడా బుల్లితెరపై , యూట్యూబ్‌లో సక్సెస్‌ అయింది. ముఖ్యంగా బాహుబలి తర్వాత తెలుగు సినిమాల హిందీ వెర్షన్‌లపై బాలీవుడ్‌ ప్రేక్షకులకి బాగా ఇంట్రస్ట్‌ ఏర్పడుతోంది. 

ఇక 'ధృవ' చిత్రం డబ్బింగ్‌లో రామ్‌చరణ్‌ పాత్రకు బాలీవుడ్‌స్టార్‌ అజయ్‌దేవగణ్‌ డబ్బింగ్‌ చెప్పాడు. ఇక అరవింద్‌స్వామి పాత్రకు సల్మాన్‌ఖాన్‌ సోదరుడు అర్భాజ్‌ఖాన్‌ వాయిస్‌ అరువిచ్చాడు. దీంతో ఈచిత్రం డబ్బింగ్‌ వెర్షన్‌పై అంచనాలు పెరిగాయి.

అజయ్‌దేవగణ్‌ దీని గురించి మాట్లాడుతూ, నేను నటించే పలు చిత్రాలను ఆ చానెల్‌వారే శాటిలైట్‌ రైట్స్‌ తీసుకుంటారు. వారు రామ్‌చరణ్‌ పాత్రకి డబ్బింగ్‌ చెప్పమని అడిగితే సంతోషంగా ఒప్పుకున్నాను. ఇంతవరకు నా పాత్రలకు నేనే డబ్బింగ్‌ చెప్పుకుని తెరపై చూసుకున్నాను. ఇప్పుడే మొదటి సారిగా వేరేహీరోకి డబ్బింగ్‌ చెప్పి, దాని ఫీలింగ్‌ని ఎంజాయ్‌ చేయబోతున్నాను అని తన సంతోషం వెలిబుచ్చాడు. 

Ajay Devgn Dubs for Ram Charan's Role:

Bollywood star hero Ajay Devgn lent his voice for Ram Charan's role in the film Dhruva while Salman Khan's brother Arbaaz Khan dubbed the voice of another key character Arvind Swamy in the movie. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs