Advertisement
Google Ads BL

సమంత ఈసారి ఎలా శృతి మించుతుందో..!?


పెళ్లి అనుకున్న తర్వాత సమంత విపరీతమైన అంద ప్రదర్శన చేస్తుందంటూ ఆ మధ్యన తెగ వార్తలొచ్చాయి. మామూలుగానే సమంత అంద ప్రదర్శన కి ఎప్పుడూ 'నో' చెప్పలేదు. అలాగని సినిమాల్లో అతిగానూ చెయ్యను లేదు. కానీ మొన్నటికి మొన్న చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న సమంత తన అందాలను ఆ చేనేత బట్టలలో విపరీతంగా చూపించేసి టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఓ మ్యాగజైన్ కోసం సమంత ఆ చేనేత వస్త్రాలు ధరించి నడుంఒంపులను.. చూపిస్తూ గ్లామర్ షో తో ఫోటో షూట్ చేయించుకుంది

Advertisement
CJ Advs

అయ్యో అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్ళబోయే సమంత ఇలా చేయడం ఎమన్నా బాగుందా అంటూ అందరూముక్కున వేలేసుకున్నారు. కానీ అక్కినేని ఫ్యామిలీకి లేని బాధ వీరికెందుకు చెప్మా అంటూ కొందరు సెటైర్స్ వేశారు అది వేరే విషయం. అయితే సమంత ఒక ఇంటర్వ్యూ లో ఫుడ్ లేకపోయినా వుంటాను గాని సెక్స్ లేకుండా బతకలేనంటూ హాట్ హాట్ కామెంట్స్ చేసి మళ్ళీ సంచలనం అయ్యింది అమ్మడు పెళ్లి అనుకున్నాక మాత్రం విపరీతంగా రెచ్చిపోతుందని చాలామంది అంటున్నారు.

అయితే ఇప్పుడు సమంత మరో సంచలనానికి రెడీ అయ్యిందట. చేనేత వస్త్రాలతో తయారయ్యే డిజైన్స్ ని సమంత ధరించి క్యాట్ వాక్ చెయ్యబోతుందట. మరి ర్యాంప్ మీద ఎలాంటి డ్రెస్సులతో సమంత తన గ్లామర్ షో చెయ్యబోతుందో అంటూ అప్పుడే అక్కినేని అభిమానులు కంగారు పడిపోతున్నారు. అయితే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 7న హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంలో సమంత ఈ క్యాట్ వాక్ చేయబోతుందట. మరి కేవలం ఫంక్షన్స్ కి మాత్రమే చేనేత వస్త్రాలతో వెళితే ఏం మజా ఉంటుంది... ఇలా క్యాట్ వాక్ లు గట్రా చేస్తేనే అసలైన మజా వస్తుందంటుంది సమంత.

Samantha Ready to Woven 2017 a walk to Fashion:

Telangana Handloom Ambassador Samantha to Attend Woven 2017 a walk to Fashion Event 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs