Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ సంతోషం ఏమిటో తెలుసా..?


జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఒకపక్క సినెమాలతోను మరో పక్క బుల్లితెర మీద బిగ్ బాస్ షోలో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. ఇంత బిజిలోను ఎన్టీఆర్ తన కొడుకుతో కాస్త టైం స్పెండ్ చేస్తున్నాడు. అయితే ఈ మధ్యన కొడుకు అభయ్ రామ్ స్కూల్ కి వెళ్లడంతో తాను అభయ్ తో ఎక్కువ సమయం గడపలేకపోతున్నందుకు కొంచెం బాధ పడుతున్నాడు కూడా. అయితే తాజాగా తన కొడుకు పుట్టినరోజు ఈ రోజు శనివారమే కావడంతో బుల్లి అభయ్ రామ్ కి చాలామంది ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేసారు. కొరటాల శివ అయితే 'నాబుల్లి ఫ్రెండ్ అభయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు గాడ్ బ్లెస్ యు' అంటూ దీవెనలు అందించాడు. ఇక ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియాలో 'నా సంతోషానికి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ తన కొడుకు అభయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఒక పిక్ ని కూడా పోస్ట్ చేశాడు.

Advertisement
CJ Advs

మరి ఆ పిక్ లో ఎన్టీఆర్ చేతిని పట్టుకుని బుల్లి అభయ్ మెట్లు దిగుతుంటే బుల్లి టైగర్ వస్తున్నాడా అనిపిస్తుంది. అయితే ఆ పిక్ లేటెస్ట్ గా ఉండడమే కాదు ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సెట్స్ లో అన్నట్టు తెలియవస్తుంది. మరి ఒకవేళ ఎన్టీఆర్ తన కొడుకు అభయ్ ని ఈ రోజు శనివారం బిగ్ బాస్ సెట్స్ లోకి తీసుకురాబోతున్నాడా..? అనే డౌట్ కొడుతోంది. మరి ఆ పిక్ లోని వాతావరణం, ఆ స్టెప్స్, అవన్నీ కూడా బిగ్ బాస్ హౌస్ సెట్స్ లాగా కనిపించడమే ఈ డౌట్ కి కారణం. 

మరి తన ఫ్యామిలీని కూడా బిగ్ బాస్ సెట్స్ కి తీసుకొస్తారా? అని మీడియా ఎప్పుడో ఎన్టీఆర్ కి ప్రశ్న వేసింది. అందులో భాగంగానే ఎన్టీఆర్ ఈ  రోజు  బిగ్ బాస్ లో ప్రేక్షకులకు అభయ్ రామ్ అల్లరిని పరిచయం చేయబోతున్నాడా? ఏమో మరి కొన్ని గంటల్లో ఎదో ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా ఎందుకు కంగారు. వెయిట్ అండ్ సి.  

Jr NTR Birthday Wishes to His Son Abhay Ram:

Jr NTR son Abhay Ram Birthday Special Pic
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs