Advertisement
Google Ads BL

సాయి పల్లవి కి హిట్... ఈ హీరో ఫుల్ ఖుషి..!


శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫిదా లో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి నటనకు 100 శాతం మార్కులు పడుతున్నాయి. ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఫిదా చిత్రం పాజిటివ్ టాక్ తో సూపర్ రివ్యూస్, రేటింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. పక్క రాష్ట్రం నుండి వచ్చిన సాయి పల్లవి ఇక్కడ తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసింది.

Advertisement
CJ Advs

మలయాళ ప్రేమమ్ లో అదరగొట్టిన సాయి పల్లవి వెంటనే తెలుగులోకి తీసుకొస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎందుకో జరగలేదు. కానీ శేఖర్ కమ్ముల ఫిదాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి మొహం మీద మోటాలు ఉన్నా, ఆమె కోప్పడుతూ కనిపించినా కూడా ఆమె నటన ముందు అవన్నీ ఏమి కనబడలేదు.  ఫిదాలో  వరుణ్ తేజ్ నే కాదు సినిమాలో ఏ పాత్రనైనా భానుమతి పాత్రతో డామినేట్ చేసేసింది సాయి పల్లవి. తెలంగాణ యాసతో అదరగొట్టేసింది. మరి ఈ సినిమా ఇంత పెద్ద హిట్టయ్యాక సాయి పల్లవికి తెలుగు సినిమాల్లో ఇక అదిరిపోయే ఆఫర్స్ రావడం మాత్రం పక్కా అంటున్నారు.

ఇప్పటికే దిల్ రాజు బ్యానర్ లో మూడు సినిమాలకు బుక్కైన సాయి పల్లవి  ఫిదా తో ఒక సినిమా ఫినిష్ చేసేసింది. మరో రెండు సినిమాలు కమిట్మెంట్స్ ఉన్నాయ్. అయితే ఇప్పుడు సాయి పల్లవి తెలుగులో తన రెండో చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ కు చేస్తుంది. ఎఎల్ విజయ్ డైరక్షన్ లో నాగశౌర్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేసుకుంది. అయితే ఇప్పుడు ఫిదా హిట్ తో సాయి పల్లవికి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఇప్పుడు సాయి పల్లవికి వచ్చిన క్రేజ్ నాగ సౌర్యకి సినిమాకు పనికొస్తుందంటున్నారు. ఈ విషయంలో నాగశౌర్య మాత్రం ఫుల్ హ్యపీగా ఉన్నాడంటున్నారు.

Naga Sourya Happy with Fidaa Success:

Naga Sourya and Sai Pallavi Movie Ready for Release. This Film Directed by AL Vijay
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs