Advertisement
Google Ads BL

ఈ సారీ గోవాలో సక్సెస్‌ పార్టీ అంటున్నారు..!


ప్రస్తుతం టాలీవుడ్‌ని కుదిపేస్తున్న డ్రగ్స్‌ కేసులో ఎక్కువ మందిని అదికారులు ఎందుకు గోవా వెళ్లారు? అని ప్రశ్నిస్తున్నారు. అధికారుల్లోనే కాదు... సామాన్య మానవులకు కూడా గోవా అంటే ఓముద్ర పడిపోయింది. అక్కడికి బీచ్‌లలో ఎంజాయ్‌ చేస్తూ మద్యం కొట్టడానికి, బాడీ మాసజ్‌ల కోసం, డ్రగ్స్‌ కోసం... ఇలా విదేశీయులతో సందడి ఉండే గోవా అనేది ముద్ర పడింది. ఇక అక్కడి యూత్‌ కూడా ఆ కల్చర్‌తో యమాఫాస్ట్‌గా ఉంటారని, ఇండియాలోని సింగపూర్‌ వంటిది ఈ గోవా అని, ఇక్కడ పాశ్చాత్య ప్రభావం ఎక్కువ అని నమ్ముతారు అందరూ. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే నాని హీరోగా నివేదా థామస్‌ హీరోయిన్‌గా ఆది పినిశెట్టి కీలక పాత్రను పోషించిన 'నిన్నుకోరి' చిత్రం అందరి అంచనాలనే కాదు.. ఈ చిత్రంలోని వారికి కూడా షాకిస్తూ అర్బన్‌ ఆడియన్స్‌నే కాదు...రూరల్‌ ఆడియన్స్‌ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఇప్పటికే సూపర్‌ హిట్‌ దశను దాటి బ్లాక్‌ బస్టర్‌ దిశగా అడుగులు వేస్తోంది. ఇక ఈ చిత్రంలో దర్శకుడు శివ నిర్వాణతో పాటు భారీ బడ్జెట్‌ కేటాయించిన దానయ్య, రచయితగా, సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించిన కోన వెంకట్‌ వంటి వారందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. 

దాంతో ప్రేక్షకుల కోసం ఇటీవలే విజయవాడలో సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు కేవలం తమ టీం మొత్తం సక్సెస్‌ పార్టీని ఎంజాయ్‌ చేయడం కోసం గోవా వెళ్తున్నారు. ఆదివారం అక్కడ పెద్ద ఎత్తున పార్టీ చేసుకుని, సోమవారం యూనిట్‌ మొత్తం మరలా హైదరాబాద్‌ రానుంది....! 

Nennu Kori Movie Success Party in Goa:

Now they are just going to Goa to enjoy the total movie unit of Ninnu kori movie success party.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs