బోయపాటి శ్రీను - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న 'జయ జానకి నాయక' చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ వదిలినప్పటినుండి బోయపాటి రొమాంటిక్ యాంగిల్ ని టచ్ చేశాడని తన మాస్ జపం వదిలేసాడనే టాక్ వచ్చేసింది. మరి మాస్ డైరెక్టర్ క్లాస్ గా రొమాంటిక్ యాంగిల్ లో సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమాపై విపరీతమైన ఆసక్తి, అంచనాలు వచ్చేస్తాయి. బోయపాటి మారాడు అని అనుకుంటున్నారో లేదో నేనేం మారలేదంటూ 'జయ జానకి నాయక' మాస్ లుక్ ని కూడా వదిలాడు.
అలాగే టీజర్ విషయంలోనూ సేమ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు బోయపాటి. ముందుగా సాఫ్ట్ గా ఉన్న టీజర్ ని వదిలాడు. ఇప్పుడు తాజాగా మాస్ టీజరో తో వచ్చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ని మాస్ గా క్లాస్ గా చూపిస్తూ బోయపాటి ఈ చిత్రంపై అంచనాలను పెంచుతున్నాడు. ఇప్పుడు 'జయ జానకి నాయక' టీజర్ లో మాస్ మసాలా దంచి కొట్టాడు. 'లైఫ్ లో కష్టం వచ్చిన ప్రతీసారీ లైఫ్ ను వదులుకోం.. ప్రేమను వదిలేసుకుంటాం.. నేను వదలను.. ఎందుకంటే నేను ప్రేమించా' అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఈ సినిమా ఊర మాస్ అని నిరూపించేసింది.
మరి ఫస్ట్ టీజర్ లో బెల్లంకొండని రొమాంటిక్ యాంగిల్ లో సాఫ్ట్ గా చూపెట్టిన బోయపాటి ఇప్పుడు సెకండ్ టీజర్ లో మాత్రం మాస్ లుక్ తో ఇరగ్గొట్టేశాడు. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. అయితే ఈచిత్రం బోయపాటి గత చిత్రం 'సరైనోడు' కు దగ్గరగా ఉందనే కామెంట్స్ ఫస్ట్ టీజర్ అప్పటి నుండి టాక్ వినబడుతుంది. ఈ టీజర్ కూడా 'సరైనోడు' నే తలపిస్తుండటం మరో విశేషం.