Advertisement
Google Ads BL

ఛార్మి గురించి పూరి భార్య బయటపెట్టింది..!


డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకుని సిట్ ముందు విచారణకు హాజరవుతున్నారు సెలబ్రిటీలు. ముందుగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ సిట్ ముందు హాజరయ్యాడు. తర్వాతి రోజు శ్యామ్ కె నాయుడు హాజరు కాగా ఆ తర్వాత వరుసగా సుబ్బరాజు మిగతా వారు తమ తమ డేట్స్ లో సిట్ ముందు హాజరు కావాల్సి వుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఈ డ్రగ్స్ కేసు మంచి హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఇక ఈ కేసు మొత్తం పూరి చుట్టూనే  అల్లుకుని ఉండడంతో అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. అదేమిటంటే ఈ డ్రగ్స్ కేసులో ఎక్కువగా లింక్ ఉన్నది హీరోయిన్ ఛార్మికి అంటున్నారు.

Advertisement
CJ Advs

ఇది అన్నది కూడా పూరి భార్య లావణ్యనే అంటున్నారు. ఛార్మి తో ఫ్రెండ్ షిప్ వలెనే పూరి ఇలా అయ్యాడని లావణ్య తన సన్నిహితుల వద్ద చెప్పుకుందని అంటున్నారు. ఛార్మి, పూరి దగ్గరికి వచ్చాకే పూరి కి మనీ ప్రొబ్లెమ్స్ వచ్చాయని.... అలాగే పూరి తీసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయని ఆవేదన చెందుతూ వారికి తన గోడు వెళ్లబోసుకుంటుందట. ఇక ఛార్మి.. అన్నకి పంజాబ్ డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నాయని... సిట్ అధికారులు అక్కడికి వెళ్లి వారిని పట్టుకోవాలని ఆమె కోరినట్లు కూడా న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారమవుతుంది.

ఛార్మితో పూరి ఫ్రెండ్ షిప్ చేశాక తమ కుటుంబంలో కలహాలు వచ్చాయని.... పూరీని గట్టిగా నిలదీస్తే ఇంటికి రావడం మానేసి ఆఫీసులోనే ఉండిపోయాడని.... ఇంకా గట్టిగా లాగితే తెగే ప్రమాదం ఉండబట్టే తానూ సైలెంట్ అయ్యానని  చెబుతుందట. మరి లావణ్య చెబుతుందని చెబుతున్న ఈ మాటలు చూస్తుంటే టాలీవుడ్ లో పూరికి, ఛార్మికి మధ్యన ఏదో సంబంధం ఉందనే గాసిప్స్ నిజమనేలానే ఉన్నాయి.  ఛార్మి కూడా హీరోయిన్ అవకాశాలు పోయాక పూరితో కలిసి వ్యాపారం స్టార్ట్ చేసింది. ఇక ఆ వ్యాపారానికి మొత్తం పెట్టుబడి పూరీనే పెట్టాడంటున్నారు. ఇక పూరి వ్యాపారాలకు ఛార్మిని ఎండీని చేసి తన పక్కనే పెట్టేసుకున్నాడని....లావణ్య వాపోతుంది. మరి నిజంగా పూరి వైఫ్ లావణ్య అన్నదని చెబుతున్న విషయాలను సిట్ అధికారులు సీరియస్ గా తీసుకుంటే ఛార్మి.. జైలు ఊచలు లెక్కెట్టడం ఖాయమంటున్నారు.

Puri Jagannadh Wife Fires On Charmi Over Narcotics Racket Case:

Puri Jagannadh Wife Lavanya reveals Charmi and Puri's Open Secret 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs