Advertisement
Google Ads BL

హిట్సిచ్చినా.. ఈ డైరెక్టర్ అంటే భయమెందుకు?


మినిమమ్ గ్యారెంటీ హీరోలను ఎవరైనా పెద్ద నిర్మాత తన నిర్మాణంలో ఒక పెద్ద డైరెక్టర్ తో కలిసి సినిమా నిర్మిస్తాను అంటే ఆ హీరోల పంట పండినట్లే. పెద్ద నిర్మాత చేతిలో పడితే వారికీ స్టార్ స్టేటస్ వచ్చేస్తుంది... కాబట్టి అలా ఆశపడడంలో తప్పులేదు. మరి ఆ పెద్ద నిర్మాత ఆ హీరోలను పిలిచి ఈ మధ్యన హిట్ అనుకునే సినిమాని తీసి నోరుపారేసుకుంటున్న డైరెక్టర్ తో సినిమా తెరకెక్కిస్తాను అంటే ఆ హీరోలు భయపడరూ. అసలా హీరోలు, ఆ డైరెక్టర్, ఆ నిర్మాత ఆ కథా కమామిషు ఎవరో మీకు ఈపాటికే కొంచెం అర్ధమై ఉండాలి.

Advertisement
CJ Advs

సరే ఇప్పుడు ఆ కథ లోకి వస్తే... టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ కొత్త డైరెక్టర్స్ కి అవకాశాలు ఇస్తూ ఎప్పుడు కొత్త తరాన్ని ప్రోత్సహిస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా నాని తో వరుసగా రెండు సినిమాలు నిర్మిస్తున్నాడు. అందులో ఒకటి 'నేను లోకల్' విడుదల కాగా, ఇపుడు 'ఎంసీఏ' ని నిర్మిస్తున్నాడు. అయితే టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరోలుగా పేరున్న రాజ్ తరుణ్, నిఖిల్ లు దిల్ రాజు బ్యానర్ లో నటించడానికి రెడీ అయ్యారు. ఇక నిఖిల్ కి డైరెక్టర్ గా చందు మొండేటి పేరు ప్రచారంలోకి వచ్చింది.

అయితే ఇప్పుడు దిల్ రాజు.. హరీష్ తో ఒక సినిమా కమిట్మెంట్ తో వున్నాడట. హరీష్ తయారు చేసే కథతో రాజ్ తరుణ్ తో అయినా, లేకపోతే నిఖిల్ తో అయినా సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఈ విషయం అలా అలా ఆ ఇద్దరు హీరోల వద్దకు చేరడంతో ఆ హీరోలిద్దరూ కాస్త భయపడ్డారని టాక్ వినబడుతుంది. హరీష్ కి అసలే నోటి దూల ఎక్కువ. ఈ మధ్యనే డీజే ని హిట్ అంటూ మీడియాకి సవాల్ విసిరి ఎవరికీ కనబడకుండా అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడు. అయితే కథ నచ్చకపోతే రాజ్ తరుణ్ మొహమాట పడకుండా సినిమా చెయ్యనని పక్కాగా చెప్పేస్తాడు. ఇక నిఖిల్ కూడా ఈ మధ్యనే హిట్ ట్రాక్లో ఉన్నాడు గనక హరీష్ తో సినిమా అంటే ఏమంటాడో అనే డౌట్ బాగా కొడుతోంది అంటున్నారు. మొత్తానికి హరీష్ కి మళ్ళీ కష్టకాలం వచ్చేనట్లే కనిపిస్తుంది.

Why Young Heroes Feared with Harish Shankar..?:

Dil Raju Plans Movie with Nikhil and Raj Tarun in the direction of Harish Shankar. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs