Advertisement
Google Ads BL

మెగాహీరో ఆశలు ఫలిస్తాయా...?


నేడున్న నిర్మాతల్లో దిల్‌రాజు టేస్ట్‌కి మంచి రెప్యుటేషన్‌ ఉంది. ఆయన సినిమా నిర్మిస్తున్నాడంటే ఖచ్చితంగా సమ్‌థింగ్‌ స్పెషల్‌గానే చెప్పాలి.ఇక స్టార్స్‌తో చేసేటప్పుడు ఆయన కొన్నిసార్లు ఫెయల్‌ అవుతుంటాడు. కానీ చిన్న చిత్రాలు, ఫీల్‌గుడ్‌ మూవీస్‌ విషయంలో మాత్రం ఆయన చాలా పర్‌ఫెక్ట్‌, స్టార్స్‌తో కాంప్రమైజ్‌ అయినట్లుగా మిగతా విషయాలలో రాజీపడడు. ఇక శేఖర్‌కమ్ముల ప్రస్తుతం ఫామ్‌లో లేకపోవచ్చు కానీ ఆయన అభిరుచి అందరికీ తెలిసిందే. 

Advertisement
CJ Advs

ఇక మెగాహీరో వరుణ్‌తేజ్‌ తాను 'మిస్టర్‌' విషయంలో చేసిన తప్పును అందరి ముందు ఒప్పుకున్నాడు. అదే సమయంలో 'ఫిదా'పై మాత్రం చాలా నమ్మకం కనపరిచాడు. ఎంతగా పొగుడుకున్నా కూడా సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చిందా? లేదా? అనేది ప్రీవ్యూ చూసిన తర్వాత ఇచ్చే స్టేట్‌మెంట్స్‌, మాటలు, బాడీ లాంగ్వేజ్‌లో చాలా వరకు కనిపిస్తుంది. ఇక దిల్‌రాజు, శేఖర్‌కమ్ముల, వరుణ్‌తేజ్‌లు మాత్రం 'ఫిదా' విషయంలో చాలా నమ్మకంగానే ఉన్నారు. 

సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని, సాధారణంగా తాను చేసే సినిమా కథలన్నీ మొదట నాన్న వింటారని, కానీ ఈ చిత్రానికి నిర్మాత దిల్‌రాజు కావడంతో ఆయన కథ కూడా వినలేదని వరుణ్‌తేజ్‌ అంటున్నాడు. ఎంతైనా ఆయన వర్మ చెబినట్లు తన తండ్రి దారిలో వెళ్లకపోవడమే మంచింది. నిర్మాతగా ఒక్క 'బావగారూ బాగున్నారా' తప్ప ఆయన నిర్మించిన ఏ చిత్రం ఆడలేదు. భారీ నష్టాలను తెచ్చాయి. 

కాబట్టి సాయి ధరమ్‌ తేజ్‌ లాగానే వరుణ్‌ తేజ్‌ కూడా కథ వినడానికి తన తండ్రిని కాకుండా ఇంకో గాడ్‌ఫాదర్‌ని వెత్తుకుంటే మంచింది. ఇక ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ నటన కంటే సాయి పల్లవి క్యారెక్టర్‌ బాగా డామినేట్‌ చేసిందనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. మరి ఏది ఏమైంది... మరికొన్నిగంటల్లో తేలిపోతుంది కదా..! తినబోతూ రుచెందుకు? అనిపిస్తోంది. 

Varun Tej Movie Fidaa Release 21st July:

Varun Tej and Sai pallavi Acted movie of 'Fidaa' Director by Sekhar Kammula and Producer Dil Raju. This Movie Release on 21st July 2017
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs