Advertisement
Google Ads BL

వేరే హీరోలను వివాదంలోకి లాగుతున్న రానా..!


రానా దగ్గుబాటి.. ఆయన కెరీర్‌ను 'బాహుబలి'కి ముందు తర్వాత అని చెప్పుకోవచ్చు. 'బాహుబలి-ది బిగినింగ్‌' తర్వాత 'ఘాజీ'తో ఓకే అనిపించాడు. 'బాహుబలి- ది కన్‌క్లూజన్‌'తర్వాత తేజతో కాజల్‌ అగర్వాల్‌ని తీసుకుని తన తండ్రి సురేష్‌బాబు నిర్మాతగా 'నేనే రాజు నేనే మంత్రి' అంటూ పొలిటికల్‌ పంచ్‌లు విసరడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం ఆగష్టు11న విడుదలకానుంది. తాజాగా రానాని అందరూ ఎప్పుడు అడిగే విధంగానే మీ పెళ్లేప్పుడు అని అడిగారు. 

Advertisement
CJ Advs

నేడు టాలీవుడ్‌లోని ప్లేబోయ్‌ తరహా ఇమేజ్‌ ఉన్న ఏకైక హీరో రానా కాబట్టి, ఆయన బిపాసాబసు, త్రిషలతో నడిపిన చిలిపి అంతా తెలుసుకాబట్టి ఆయన్ను అందరూ అదే అడుగుతారు. కానీ ఆయన ఇప్పుడు కాదనో. లేక మా ఇంట్లో అడగమనో చెప్పకుండా, నాకంటే ప్రభాస్‌, నితిన్‌లు వయసులో పెద్ద. ముందుగా వారిని వివాహం చేసుకోనివ్వండి.. తర్వాత నా సంగతి అడుగుదురు కానీ, అయినా మా ఇంట్లో వారు కూడా నన్ను ఇంతగా పెళ్లి పెళ్లి అని వేధించడం లేదు. మరి మీరు మరీ మరీ అదే అడుగుతున్నారు... అని తెలివిగా ప్రశ్నను దాటవేశాడు. 

అయితే రానాని నీ పెళ్లేప్పుడు అని అడిగితే ఆయన ఏకంగా ప్రభాస్‌, నితిన్‌లతో కంపేర్‌ చేసేసి ఈ వాదనలోకి వారిద్దరిని కూడా తెలివిగా లాగేశాడు. ఇక ఈ ఏడాది చివరలో గానీ, వచ్చే ఏడాది ప్రధమార్ధంలో గానీ ప్రభాస్‌ పెళ్లి ఉంటుందంటున్నారు. మరోపక్క రానా కేవలం తన వయసు 33 మాత్రమే అంటున్నాడు. పాతకాలంలో అయితే 33ఏళ్లకే తాతలు కూడా అయ్యేవారు. అయినా హోటల్‌ రుచి మరిగిన వారికి ఇంట్లో చేసే ఒకేరకమైన వంట ఎలా రుచిస్తుంది? అంటూ కొందరు రానాపై సెటైర్లు వేస్తున్నారు. 

Rana Daggubati About Prabhas and Nithiin Marriages:

Rana Daggubati acted movie 'Nene Raju Nene manthri' director by Teja and this movie release on august 11th. Rana about Prabhas and Nithiin marriages 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs