Advertisement
Google Ads BL

బిగ్‌బాస్‌లో మొదటి ఎలిమినేటర్‌ ఆమేనట...!


టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ముమైత్‌ ఖాన్‌ కూడా లిస్ట్‌లో ఉండటంతో ఆమెకు హైదరాబాద్‌లో నివాసం ఉందని తెలిసి అధికారులు నోటీసు ఇవ్వాలని భావించారు. కానీ ఆ ఇల్లు ఆమె ఎప్పుడో ఖాళీ చేసింది. ఇక ముంబైలో కూడా ఆమెకు పర్మినెంట్‌ అడ్రస్‌ అనేది లేకపోవడంతో ఆమెకు నోటీసులు ఎలా అందజేయాలా? అని ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉంది. ఆ షో చట్టప్రకారమే జరుగుతోంది. 

Advertisement
CJ Advs

దాంతో ఆ హౌస్‌లోపలికి వెళ్లి నోటీసులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక ముమైత్‌ ఈనెల 21న సిట్‌ ముందు హాజరుకావాల్సి ఉంది. దాంతో ఆమెకు అధికారులు కాస్త సడలింపు ఇచ్చారు. మరోపక్క తెలుగు బిగ్‌బాస్‌లో తెలుగులోనే మాట్లాడాలనే నిబంధన ఉంది. దానిని మొదటే స్పష్టం చేశారు. కానీ గత రెండు రోజులుగా ఆమె కేవలం హిందీ, ఇంగ్లీషులలో మాట్లాడుతోంది. ఇక ఈమంటే మిగిలిన పార్టిసిపెంట్స్‌కి కూడా పడటం లేదట. మరోవైపు డ్రగ్స్‌ కేసు ఉండటంతో మొదటి వారం ఎలిమినేట్‌ అయ్యేది ఆమేనని, తద్వారా ఆమె సిట్‌కి హాజరయ్యేలా చూడటంతో పాటు డ్రగ్స్‌ వాడే వ్యక్తిని బిగ్‌బాస్‌కి ఎంపిక చేశారనే మచ్చను కూడా తొలగించుకోవాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. 

మొత్తానికి మరలా శని, ఆదివారాల్లో ఎన్టీఆర్‌ హోస్ట్‌గా కనిపిస్తాడు కాబట్టి అప్పుడే ఆమెను ఎలిమినేట్‌ చేయవచ్చు అని తెలుస్తోంది. ఇక బిగ్‌ బాస్‌ మూడో రోజు ఆదర్శ్‌ బాలకృష్ణ తీరు విస్తుగొలిపింది. ఆయనకు మద్యం అలవాటు ఉండటమో లేక డ్రగ్స్‌ వంటివి అలవాటో గానీ ఆయన ఓ సైకోలా బిహేవ్‌ చేశాడు. విస్కీ, విస్కీ అంటూ అరిచాడు. ధన్‌రాజ్‌ చేతిని కొరికాడు. రక్తం కూడా వచ్చింది. కానీ చివరలో ఇదేదో కావాలని చేసినట్లు బిల్డప్‌ ఇచ్చారు. 

Mumaith Khan Eliminate in Bigg Boss Show?:

Telugu Bigg Boss has a clause in Telugu. It was first made clear. But Mumait Khan has been speaking Hindi and English for the past two days.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs