Advertisement
Google Ads BL

చిరు బయోపిక్‌పై చర్చలేపాడు..!


తెలుగు నటుల్లో బెనర్జీ చాలా సీనియర్‌. ఆయనది 35ఏళ్లకు పైగా సాగిన సినీ జీవన ప్రయాణం. కానీ ఆయన గొప్పనటుడే గానీ ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. దాదాపు 350కి పైగా చిత్రాలలో నటించినా కూడా ఆయనకు ఉండే డైలాగ్స్‌ చాలా తక్కువగా ఉంటాయి. ఆయన తన ఆహార్యంతోనే ఆకట్టుకుంటాడు. ఇక ఆయన నటించిన 'నల్లత్రాచు' సినిమా అప్పట్లో పెద్ద సంచలనం. కాగా ఆయన ప్రస్తుతం 'రక్తం' అనే చిత్రం చేస్తున్నాడ. 

Advertisement
CJ Advs

'బంగారుతల్లి' దర్శకుడు రాజేష్‌ టచ్‌ లీవర్‌ దీనికి డైరెక్షన్‌ వహించాడు. విడుదలకు ముందే ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు, అవార్డు వేడుకల్లో ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా ఆయన ఓ యూట్యూబ్‌చానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనిలో ఆయన మాట్లాడుతూ, నా పేరు వేణు బెనర్జీ. కృష్ణాజిల్లాకు చెందిన వాడిని. మాది కమ్యూనిస్ట్‌ కుటుంబం. నాడుబెంగాల్‌కి చెందిన పలు కుటుంబాలు కులాలకు, మతాలకు అతీతంగా బెంగాళీ పేర్లైన బెనర్జీ, చటర్జీ, బోస్‌ అనే పేర్లు ఉండేవి. 

1980లో డైరెక్టర్‌ అవుదామని మద్రాస్‌ వెళ్లి దర్శకత్వశాఖలో అన్ని మెలకువలు నేర్చుకున్నాను, హీరోగా కాకముందే చిరంజీవి నాకు పరిచయం మల్లాది వెంకటకృష్ణమూర్తి రచించిన 'ధర్మయుద్దం' చిత్రాన్ని నా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నిర్మాత వెంకన్నబాబు సినిమా తీయాలని భావించారు. చిరు సామాన్యుని నుంచి ఎంతో కష్టపడి మెగాస్టార్‌ అయిన విధానం ఎందరికో స్ఫూర్తి. ఆయన తన 150వ చిత్రానికి కూడా మొదటి చిత్రంలాగే కష్టపడ్డాడు. ఆయన ఓ రైటర్‌ని పెట్టుకుని తన బయోగ్రఫీపై స్క్రిప్ట్‌ రాసి సినిమా తీస్తే సమాజానికి ఎంతో స్ఫూర్తి అవుతుంది. ఆ అవకాశం నాకొస్తేకాదనను. కానీ నాకన్న చిరు అంటే ప్రాణం ఇచ్చే దర్శకులు, నాకంటే ప్రతిభ కలిగిన వారు ఎందరో ఉన్నారు. 

ఇక సినిమా ఫీల్డ్‌లో ఎవరిని ఎవరూ తొక్కలేరు. అది అనవసరపు వాదన. టాలెంట్‌లేని వారిని ఏ గాడ్‌ఫాదర్‌ నిలబెట్టలేడు. నన్ను ఎవ్వరూ తొక్కలేదు. నన్ను తొక్కాలని చూస్తే వారి కాళ్లే నొప్పిపుడతాయి. ఇక పవన్‌ జనసేన పెట్టడం ఆయన వ్యక్తిగత విషయం. నన్ను ఆహ్వానిస్తే చేరుతా. ఇలాంటి ఊహాజనిత ప్రశ్నలను నేను పట్టించుకోను. ఇక వర్మ అంతే. చాలా మంచివాడు, మేధావి. ఇక విమర్శలు, కామెంట్లు ఆయన వ్యక్తిగతం, ఆయన తనకు నచ్చినట్లు జీవించాలనుకుంటారు. దానిని ప్రశ్నించే హక్కు ఎవరికిలేదు.. అంటూ సమాధానం చెప్పారు. 

Venu Banerjee About Chiranjeevi Biopic:

Actor Venu Banerjee Speaking about Mega Star Chiranjeevi biopic film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs