Advertisement
Google Ads BL

సాయిధరమ్.. 'దుర్గ' కంటే పవర్ ఫుల్..!


వివి వినాయక్‌ స్టైలే వేరు. మాస్‌ అండ్‌ యాక్షన్‌ హీరోలు కావాలనుకునే అందరూ ఆయనతో ఒక్క సినిమాలోనైనా నటించాలని కోరుకుంటారు. ఇక ఆయన కూడా 'లక్ష్మీ, ఆది, బన్నీ, దిల్‌' ఇలా రెండక్షరాల పేర్లను బాగా లైక్‌ చేస్తుంటాడు. ఇక ఆయన మెగాస్టార్‌ నటించిన ప్రతిష్టాత్మకమైన 150వ చిత్రం 'ఖైదీ నెంబర్‌ 150' చేశాడు. ఇది విడుదలై ఆరునెలలు పూర్తయిన ఇంకా మరో ప్రాజెక్ట్‌ మొదలుపెట్టలేదు. ఆ చిత్రం చేసిన వారంతా బిజీ అవుతున్నారు. హిస్టారికల్‌ మూవీ, ఎంతో పరిశోధన చేయాల్సిన ఉయ్యాలవాడ నరసింహారెడ్ది సైతం త్వరలోనే ప్రారంభం కానుంది. దేవిశ్రీప్రసాద్‌ వరుస చిత్రాలు చేస్తున్నాడు. కాజల్‌ తమిళంలో అజిత్‌తో 'వివేగం', తెలుగులో రానాతో 'నేనే రాజు..నేనే మంత్రి', కళ్యాణ్‌రామ్‌తో 'ఎమ్మెల్యే' చిత్రాలతో బిజీగా ఉంది. 

Advertisement
CJ Advs

కానీ ఒక్క వినాయక్‌ మాత్రమే మౌనంగా ఉన్నాడు. కాగా ఆయన తన తదుపరి చిత్రం మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో చిత్రం మాత్రం ఓకే చేశాడనేది ఒక్క విషయం తప్పితే మరో న్యూస్‌ గానీ, అప్‌డేట్‌ కానీ లేదు. ఇప్పటికే చిరంజీవి, రామ్‌చరణ్‌, అల్లుఅర్జున్‌లతో చిత్రాలు తీసిన ఆయన ఇప్పుడు మరో మెగా ఫ్యామిలీ హీరోతో, అందునా మాస్‌ హీరో అయ్యే లక్షణాలు, ఆ టైప్‌ బాడీలాంగ్వేజ్‌తో పాటు మాస్‌ అండ్‌ యాక్షన్‌ హీరోగా స్ధిరపడాలనే బలమైన కోరిక ఉన్న సాయిధరమ్‌తేజ్‌ తో సినిమా చేస్తున్నాడంటే..నిజంగా సాయి కి ఇది ఓ లక్‌ అనే చెప్పాలి. కెరీర్‌ ప్రారంభమైన కొంతకాలంలోనే ఆయనకు ఈ ఛాన్స్ వచ్చింది. 

ఇక ఈ చిత్రానికి వినాయక్‌ ఆస్థాన కవి ఆకుల శివ స్టోరీని అందిస్తుండగా సీనియర్‌ రైటర్లయిన పరుచూరిబ్రదర్స్‌, సత్యానంద్‌లు వర్క్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి హైలైట్‌ ఈ చిత్రం స్క్రిప్టే అంటున్న వినాయక్‌.. ఈ చిత్రం టైటిల్‌ ప్రచారంలో ఉన్నట్లు 'దుర్గ' కాదని తేల్చేశాడు. మరో టైటిల్‌ను పరిశీలిస్తున్నామంటున్నాడు. మొత్తానికి 'దుర్గ' పవర్‌ఫుల్‌గానే ఉన్నా.. ఇంకా పవర్‌ఫుల్‌ టైటిల్‌ కోసం ట్రై చేస్తున్నారట. త్వరలో టైటిల్‌ని, ఇతర విషయాలను అఫీషియల్‌గా ప్రకటించనున్నారు. 

VV Vinayak says no Durga for Saidhram Tej:

VV Vinayak and Sai Dharam Tej Movie Latest Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs