Advertisement
Google Ads BL

మాజీ భార్య కూడా క్రిమినల్ అని తేల్చేసింది!


మలయాళ నటి భావన కిడ్నాప్ కేసులో మలయాళ స్టార్ హీరో దిలీప్ ని అరెస్ట్ చేసిన పోలీస్ లు అతని నుండి నిజాలు రాబట్టేందుకు కొన్ని రోజులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసు నిజంగా ఒక సినిమా కథని తలపిస్తుంది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో ఇప్పటికే దిలీప్ మాజీ భార్య మంజు వారియర్‌ని పోలీసులు విచారించారు. సాక్ష్యాధారాల సేకరణలో భాగంగా మంజు వారియర్‌ స్టేట్‌మెంట్‌ని రికార్డ్ చేశారు పోలీసులు. అయితే భావన కేసులో భాగంగా పోలీసులు మంజు వారియర్‌ని ఇలా ఉన్నట్లుండి విచారించడం చాలామంది నటీనటులకు అంతుబట్టడం లేదు.

Advertisement
CJ Advs

అయితే మంజు వారియర్, నటి భావన ప్రాణ స్నేహితులు. అందుకే దిలీప్ గురించిన రహస్యాలను భావన తన ఫ్రెండ్ మంజు వారియర్ కి చెప్పడంతోనే దిలీప్ కి ఆమెకు మధ్యన గొడవలు జరిగి విడిపోయారు. ఇక దిలీప్ మరో మలయాళ హీరోయిన్ నే మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే భావన కిడ్నాప్ ఉదంతం జరిగిన తర్వాత భావన కిడ్నాప్ వ్యవహారంలో తన మాజీ భర్త దిలీప్ హస్తం ఉన్నట్లు అప్పట్లో మంజు వారియర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు మాజీ భర్త దిలీప్ పెద్ద క్రిమినల్ అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఒక పక్క దిలీప్ మెడకు ఉచ్చు గట్టిగా బిగుస్తుండడం... బెయిల్ పిటిషన్ పెట్టుకున్నప్పటికీ... బెయిల్ మంజూరుచేస్తే సాక్ష్యాలు నాశనం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడం వంటి అంశాలు దిలీప్ ని అగాధంలోకి నెట్టేస్తున్నాయి. 

Manju Warrier named second witness in chargesheet:

The special investigation team probing the actress rape case is learnt to have recorded the statement of Manju Warrier, actress and former wife of Dileep, as part of making her a witness in the case.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs