Advertisement
Google Ads BL

సితార సూపర్‌గా ఉంది...!


నాటి రోజుల్లో మన హీరోలు సినిమాల బిజీలో తమ పర్సనల్‌ లైఫ్‌ని, తమ కుటుంబ సభ్యులకు కేటాయించడం మర్చిపోయేవారు. తమ పిల్లలు ఎదగడాన్ని వారు సరిగ్గా చూడలేదు. పెద్దయిన తర్వాత మరలా పాతకాలం రమ్మంటే రాదు. తమ పిల్లల ఎదుగుదలను, భార్యా పిల్లల ముచ్చట్లను కోల్పోయేవారు. వారు రిటైర్‌ అయిన తర్వాత తీరిగ్గా బాధపడేవారు. కానీ నేడు హీరోలు అలాకాదు. సినిమాలు చేస్తూనే తమ ఫ్యామిలీలకు కూడా కావాల్సినంత సమయం కేటాయిస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఎన్టీఆర్‌, మహేష్‌, పవన్‌, బన్నీ నాని. ఇలా అందరూ తమ ఫ్యామిలీ లైఫ్‌ని కూడా సినిమాలతో పాటు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబుని, ఆయన సినిమాలకు, యాడ్స్‌కి ఎంతో ఇంపార్టెన్స్‌ ఇస్తారు. వీలుదొరికినప్పుడల్లా తన ఫ్యామిలీతో కలిసి విదేశాలలో దిగిపోతూ ఎంజాయ్‌ చేస్తుంటాడు. తన తండ్రి మిస్‌ అయ్యాడనే ఫీలింగ్‌ని, తన కుమారుడు గౌతమ్‌కృష్ణకు, కుమార్తె సితారకు కలగనివ్వడు. 

ఇక ఆయన భార్య కూడా ఒకప్పుడు నటినే అయినా కూడా మహేష్‌తో పెళ్లైన తర్వాత నటనకు దూరంగా ఉంటూ పిల్లల ఆలనా పాలనాతో పాటు భర్త బిజినెస్‌ల నుంచి డేట్స్‌, కథల ఎంపిక వంటి వాటిల్లో కూడా కీలక పాత్రను పోషిస్తోంది. కాగా ఎల్లుండి అంటే జులై 20వ తేదీ మహేష్‌-నమ్రతల కుమార్తె సితార బర్త్‌డే. ఆ సందర్బంగా తన కూతురికి మంచి పట్టు పరికిణి, ఓణి వేసి, ఆ ఫొటోను షేర్‌ చేసింది. 

ఇందులో గులాబిరంగు పరికిణిలో సితార మెరిసిపోతోంది. జడకు కుచ్చులు పెట్టి, జడను ముందుకేసుకుని, వడ్డాణాన్ని నడుముకు పెట్టుకుని సితార అందరినీ మెస్మరైజ్‌ చేస్తోంది. ఐదేళ్ల వైప సితార అని కామెంట్‌ చేసింది. కాగా సితారకు 20వ తేదీతో ఐదేళ్లు నిండుతాయి. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతోంది. ఇదే రోజున మహేష్‌ నటిస్తున్న 'స్పైడర్‌' రెండో టీజర్‌ రిలీజ్‌ అవుతుందని వార్తలు వస్తున్నా ఇప్పటి వరకు అఫీషియల్‌ స్టేట్‌మెంట్‌ రాలేదు. 

Mahesh Babu Daughter Sitara in Rose Color Parikini Photo:

Mahesh Babu wife of Namratha posted daughter Sitara in rose color parikini dress photo in twitter.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs