Advertisement
Google Ads BL

ఆ ఎన్టీఆర్ కి సరైన వారసులే లేరంట..!


చలపతిరావు ఈ మధ్య తరుచు వార్తల్లో నానుతున్నాడు. కారణం అమ్మాయిల మీద ఆయన కామెంట్స్ చెయ్యడమే. అప్పుడెప్పుడో ఒక ఆడియో వేడుకలో అమ్మాయిలు పక్కమీదకు పనికొస్తారని కారు కూతలు కూసిన చలపతి రావుని కొన్ని రోజుల పాటు మీడియా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరోమారు చలపతి రావు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనమయ్యాయి.

Advertisement
CJ Advs

చలపతిరావు ని ఒక యూట్యూబ్ ఛానల్ వారు స్పెషల్ గా ఇంటర్వ్యూ చెయ్యగా.. అందులో చలపతిరావు సీనియర్ ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలిలో సరైన వారసులు లేరంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. బాలకృష్ణ గానీ, జూనియర్ ఎన్టీఆర్ గానీ ఆయనకు వారసులు కాలేరంటూ మాట్లాడి ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ లో ఎలాంటి పాత్రనైనా ఈజీగా పండించగల సత్తా వుంది. చిన్నప్పటి నుండి అన్నిటీలో (నటన, డాన్స్) ట్రైనింగ్ తీసుకుని మరీ సినిమాల్లోకి వచ్చాడు. ఏ పాత్రనైనా ఎంతో సమర్ధవంతంగా చెయ్యగల ఎన్టీఆర్ రావణాసురుడి పాత్రని మాత్రం పండించలేడు. కారణం ఆయన కొద్దిగా పొట్టివాడు. రావణుడి పాత్రని చెయ్యాలంటే పొడగరి అయ్యుండాలంటూ మాట్లాడాడు.

ఒకరి నటన గురించి మాట్లాడడం పద్దతికాదు.... కానీ ఏ దర్శకుడైనా ఎన్టీఆర్ తో రావణుడి పాత్ర చేయిస్తే మాత్రం నేనేం అభ్యంతరపెట్టను... కానీ ప్రేక్షకులు ఎన్టీఆర్ ని రావణుడిగా ఒప్పుకోవాలి కదా అంటూ మాట్లాడాడు. అలాగే గుండమ్మ కథని మళ్ళీ రీమేక్ చెయ్యడం అంత కరెక్ట్ కాదు. అందులోని ఎన్టీఆర్ పాత్రని చేయాలంటే అది ఎవరికీ సాధ్యం కాదు. ఇక ఏఎన్నార్ పాత్రని ఎవరో ఒకరు చెయ్యగలరు గాని ఎన్టీఆర్ పాత్రని మాత్రం ఎవ్వరు చేయలేరు. అసలు అంతటి మహానుభావుడికి సరితూగే వారెవ్వరూ లేరు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు కూడా పెద్దాయనకు సరితూగలేరంటూ తెగేసి చెప్పేశాడు.

మరి నందమూరి ఫాన్స్ ఈ విషయాన్ని రచ్చ చేస్తారా? లేకపోతే ఎన్టీఆర్ మీద అభిమానంతో సైలెంట్గా ఉంటారా అనేది మాత్రం ప్రస్తుతం వేచి చూడాల్సిందే.

Chalapati Rao Shocking Comments on NTR Family:

Actor Chalapathi Rao Controversial Comments on Legend NTR Family
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs