Advertisement
Google Ads BL

బిగ్ బాస్ కి రిజెక్ట్ అయ్యి, ఇలా రియాక్ట్ అయ్యింది!


'కాటమరాయుడు, ఫ్యాషన్ డిజైనర్' చిత్రాలతో ఈ మధ్యన తెలుగు తెరమీద సందడి చేసిన మానస హిమవర్ష చేతిలో పెద్దగా సినిమాలు లేక ప్రస్తుతానికి ఖాళీగానే వుంది. మరి అప్పుడప్పుడు అవార్డు ఫంక్షన్స్ లో గట్రా హడావిడి చేసే ఈ భామ ఇప్పుడు ఉన్నట్టుండి వార్తల్లోకొచ్చేసింది. ఎందుకంటే ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ మాలో ప్రచారమవుతున్న బిగ్ బాస్ షో గురించి అమ్మడు నోరు పారేసుకుంది.

Advertisement
CJ Advs

బిగ్ బాస్ లో పార్టిసిపెంట్స్ కింద చాలామందికి ఆహ్వానాలు పంపిన బిగ్ బాస్ నిర్వాహకులు వారికి ఆడిషన్ కూడా చేశారు. అయితే అందులో చాలామంది రిజక్ట్ కూడా అయ్యారు. ఇక ఆ లిస్టులో మానస హిమవర్ష కూడా ఉందంటూ ఎప్పుడో ప్రచారం జరిగింది. అయితే ఇలా రిజెక్ట్ అయిన భామ ఇప్పుడు బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ ని చూసి అందులోని పార్టిసిపెంట్స్ ని చూసాక  థ్యాంక్ గాడ్ ఈ షోలో నేను భాగస్వామిని అవ్వలేదు... బతికిపోయానంటూ ట్వీట్ చేసింది. మరి ఒక ఎపిసోడ్ కే మానస ఇలా బిగ్ బాస్ మీద ఇంత బ్యాడ్ ఒపీనియన్ కి వచ్చేసింది అంటే ఆమెను రిజెక్ట్ చేశారనే కుళ్లుతోనే కదా అంటున్నారు ఎన్టీఆర్ ఫాన్స్.

హార్ట్ అయిన ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో మానసును ఒక ఆట ఆడుకున్నారు. దెబ్బకి దిగొచ్చిన మానస ఎన్టీఆర్ ని తానేమి కామెంట్ చెయ్యలేదని.... కేవలం షో మీదే కామెంట్ చేసానని చెప్పుకొచ్చింది. 

Manasa Shocking Comments On NTR's Bigg Boss:

''Ok, Now I feel glad not being a part of it.'', Manasa Himavarsha posted a message on her social media accounts
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs