Advertisement
Google Ads BL

మహేష్‌ చాలా చాలా గ్రేట్..!


చూడటానికి పక్కా బిజినెస్‌మేన్‌గా మహేష్‌ కనిపిస్తుంటాడు. పలు యాడ్స్‌, బ్రాండ్‌ అంబాసిడర్‌గానే కాదు...... సినిమాలలో కూడా భారీ రెమ్యూనరేషన్‌ తీసుకుంటాడు. కానీ వాటిల్లో 25శాతాన్ని చారిటీకి ఉపయోగిస్తుంటాడు. వాస్తవానికి మహేష్‌ స్టార్‌ కాకముందే ఆయన అన్నయ్య రమేష్‌బాబు అప్పట్లో ఉన్నాడు. గుణశేఖర్‌ని నమ్ముకుని 'అర్జున్‌'కి మధుర మీనాక్షి వంటి సెట్టింగ్‌లకు బాగా ఖర్చు చేసి, సినిమాను కూడా భారీ బడ్జెట్‌తో నిర్మించడంతో నిర్మాతగా కూడా నష్టాలు తప్పలేదు. 

Advertisement
CJ Advs

మరోవైపు కృష్ణ కూడా నాడు ఆర్ధికంగా బాగా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. సినిమాలు ఫ్లాప్‌ కావడం, మంచితనానికి పోయి నిర్మాతలకు, బయ్యర్లకు సాయం చేయడం, పద్మాలయా టెలీఫిల్మ్స్ అప్పుల్లో ఉండటంతో వాటన్నింటినీ తీర్చే బాధ్యత మహేష్‌ తీసుకున్నాడు. తన తండ్రి ఈ ఆలోచనలతో టెన్షన్‌ పడకూడదని, తాను ఉండగా తన అన్న రమేష్‌బాబు కూడా ఇబ్బందులు పడకూడదని డిసైడ్‌ అయిన మహేష్‌ తన ఫ్యామిలీకి ఉన్న అప్పులన్నింటినీ తానే తీర్చే బాధ్యత తీసుకున్నాడు. ఆయనకేమిటి? ఆర్ధిక ఇబ్బందులు.. అనే వారు ఉండవచ్చు గానీ ఏ చెట్టుకంత గాలి... అని పెద్దలు ఊరకే చెప్పలేదు. 

దాంతో మహేష్‌ ఇప్పుడు ఆ అప్పులన్నీ వీలైనంతగా తీర్చేయడానికి నిర్ణయించుకుని, ఒకప్పటి నిదానంగా కాకుండా ఒక చిత్రం వెంటనే మరో చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు. పలువురు నిర్మాతలకు ముందుగానే కమిట్‌ అయి వారి నుంచి అడ్వాన్స్‌లు కూడా తీసుకుని, అప్పులన్నీ క్లియర్‌ చేస్తూ మహేష్‌ దిద్దిన కాపురంగా తన ఫ్యామిలీని చూసుకుంటున్నాడు. సొంత రక్తబంధం ఉన్నవారు. తల్లిదండ్రులను కూడ సరిగా చూడని ఈ రోజుల్లో మహేష్‌ కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇస్తున్న ఆయన గ్రేట్‌ అనే చెప్పాలి...! 

Greatness of Prince Mahesh Babu :

Prince Mahesh Babu Helps His Family in Troubles
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs