Advertisement
Google Ads BL

సుక్కు సామాన్యుడు కాదు...!


సామాన్యంగా తన కొడుకు ప్రమోట్‌ చేయడానికి బ్రహ్మానందమే ఇప్పటి వరకు ఎక్కువగా అందరినీ వాడుకున్నాడు. ఇక సుకుమార్‌ కూడా తన 'కుమారి 21 ఎఫ్‌'కి ఎన్టీఆర్‌ వంటి వారి చేత ప్రమోషన్‌ ఇప్పించి బాగానే వాడుకున్నాడు. ఇక తాజాగా సుకుమార్‌ తాను నిర్మిస్తున్న రెండో చిత్రం 'దర్శకుడు' కోసం ఈ వాడకాన్ని పీక్స్‌లోకి తీసుకెళ్లాడు. ఈ చిత్రం విజయం సుక్కుకి కీలకం. కారణం ఇందులో ఆయన అన్నయ్య కొడుకు హీరోగా పరిచయం అవుతున్నాడు. 

Advertisement
CJ Advs

తన ప్రాణ స్నేహితుడైన హరి ప్రసాద్‌ జక్కా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ ఆడియో వేడుకకు చరణ్‌, సురేందర్‌రెడ్డి, వంశీపైడిపల్లి, చందు మొండేటి, సుధీర్‌వర్మ, సతీష్‌ వేగ్నేష్‌ , అనిల్‌ రావిపూడి వంటి అందరినీ పిలిచి పాజిటివ్‌ బజ్‌ తీసుకుని వచ్చాడు. ఈ చిత్రం ఆడియో బాగుండటం, ట్రైలర్‌కి కూడా మంచి రెస్పాన్స్‌ వస్తూ ఉండటంతో ఈ చిత్రంపై అందరికీ ఆసక్తి మొదలైంది. మరోవైపు డైరెక్టర్ సురేందర్ రెడ్డి , సమంత, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ల ద్వారా 'దర్శకుడు' చిత్రానికి, అందులో హీరోగా నటిస్తున్న అశోక్‌కి, దర్శకుడు హరిప్రసాద్‌ జక్కాకి బాగానే ప్రమోషన్స్‌ ఇప్పిస్తున్నాడు. 

మొత్తానికి సుక్కు వాడకం చూస్తే బ్రహ్మీ కూడా ఆయన మందు దిగదుడుపే అని చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో ఎవరెవరని వాడుకుంటాడో, తనదైన శైలిలో ఈ లోబడ్జెట్‌ మూవీకి భారీ హైప్‌ ఎలా క్రియేట్‌ చేస్తాడో.. ఈ క్రియేటివ్‌ దర్శకనిర్మాతకే తెలియాలి...! 

Sukumar is Not A Simple Person:

Director Surender Reddy, Samantha and Rakul Preet Singh are directing the film 'Dharshakudu', the hero Ashok and director Hariprasad Zakka is promoting promotions.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs