మన సమాజాన్ని మార్చాలనే ప్రయత్నమో లేక సినీమాలలో రాజకీయాలను చూపిస్తే అది మంచి కమర్షియల్ ఎలిమెంట్ అవుతుందనే ఆశతోనో మనస్టార్స్ ఇప్పుడు పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ చిత్రాల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం మహేష్‌బాబు కొరటాల శివ దర్శకత్వంలో రెండో చిత్రంగా 'భరత్ అనే నేను' చిత్రం చేస్తున్నాడు. 'దూకుడు'లో నకిలీ ఎమ్మెల్యేగా మెరిపించిన ఈ చిత్రంలో ఆయన ఏకంగా సీఎంగా కనిపిస్తాడని తెలుస్తోంది.
ఇక పవన్-త్రివిక్రమ్‌ల చిత్రం కూడా పవన్ పొలిటికల్ మైలేజ్ పెంచే విధంగానే ఉండనుందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవకుశ'లో 'జై'అనే నెగటివ్ పాత్ర పొలిటికల్ టచ్‌తో ఉంటుందట. మరోవైపు అల్లు అర్జున్ చేస్తున్న 'నా పేరు సూర్య..... నా ఇల్లు ఇండియా' చిత్రంలో దేశభక్తితో పాటు రాజకీయాలపై కూడా వ్యంగ్యాస్త్రాలుంటాయని తెలుస్తోంది.
ఇక తన తొలి చిత్రం 'లీడర్'లో సీఎంగా నటించిన రానా.. తేజ దర్శకత్వంలో ఆగష్టు11న విడుదల కానున్న 'నేనే రాజు నేనే మంత్రి' మంచి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో హంగామా చేయనుందని ఈ చిత్రం టీజర్, ట్రైలర్లలోని డైలాగ్స్‌ని చూస్తే అర్ధమవుతోంది. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉండగానే మన హీరోలు పొలిటికల్ ఫీవర్ పెంచడానికి సంసిద్దులవుతున్నారు...!