రామ్ చరణ్ తో డైరెక్టర్ మణిరత్నం ఎప్పటినుండో సినిమాని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో సినిమా అదిగో.. ఇదిగో అంటున్నారు కానీ.... అది మాత్రం పట్టాలెక్కడం లేదు. మొన్నామధ్యన మణిరత్నం 'చెలియా' ప్లాప్ తో రామ్ చరణ్ మెల్లగా మణిరత్నం సినిమా నుండి సైడ్ అయినట్లు ప్రచారం జరిగింది. అంత పెద్ద డిజాస్టర్ ఇచ్చిన మణి సర్ తో సినిమా చెయ్యాలి అంటే ఏ హీరోకి ధైర్యం ఉంటుంది చెప్పండి. అందుకే రామ్ చరణ్ కూడా మణి సర్ ని లైట్ తీసుకున్నాడు.
అప్పుడెప్పుడో సుకుమార్ 'రంగస్థలం' తర్వాత చరణ్.. మణిరత్నం డైరెక్షన్ లోనే నటిస్తాడని ప్రచారం జోరుగా జరిగింది. కానీ చరణ్ గాని, మణిరత్నం గాని దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇక సుకుమార్ చిత్రం తర్వాత రామ్ చరణ్ అనూహ్యంగా కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఈ దెబ్బతో చరణ్, మణిరత్నం ని కావాలనే సైడ్ చేసాడని అర్ధమయ్యింది. కానీ ఇప్పుడు మణిరత్నం, చరణ్ ని వదలనంటున్నాడు. ఎట్టిపరిస్థితుల్లో రామ్ చరణ్ ని డైరెక్ట్ చేస్తానని చెబుతున్నాడు.
ఇప్పుడంటే ఇప్పుడే రామ్ చరణ్ ని డైరెక్ట్ చెయ్యలేకపోవచ్చుగాని.. ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా చరణ్ తో సినిమా చేస్తానని చెబుతున్నాడు మణి. మరి మణిరత్నం కోరికను మన్నించి చరణ్ త్వరలోనే ఆయనతో సినిమా చెయ్యాలని అనుకుంటున్నాడు కానీ.... పరిస్థితులు మాత్రం అందుకు అనుకూలించడం లేదుగా!