Advertisement
Google Ads BL

నితిన్‌ లైన్లో కొచ్చినట్లే..ఇది 'లై' కాదు!


కొన్ని చిన్న సినిమాలు, మీడియం రేంజ్‌ చిత్రాలు కూడా ఒక్కోసారి మంచి ఆసక్తిని రేకెత్తిస్తూ ఇండస్ట్రీతో పాటు బిజినెస్‌ సర్కిల్స్‌లో కూడా పాజిటివ్‌ బజ్‌ని రాబడుతుంటాయి. దీనికి ఆయా చిత్రాలను నిర్మించే బేనర్లు, దానికి పని చేసే హీరోహీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గంతో పాటు దర్శకుడి అభిరుచి కూడా తోడవుతుంది. అదే ప్రస్తుతం నితిన్‌ హీరోగా నటిస్తున్న 'లై' చిత్రానికి జరుగుతోంది. నేటి యంగ్‌ హీరోలలో రాజమౌళి, వినాయక్‌, పూరీ జగన్నాథ్‌, త్రివిక్రమ్‌శ్రీనివాస్‌తో పాటు అందరితో పనిచేస్తున్న నటుల్లో నితిన్‌ ఒకడు. ఆయన తన కెరీర్‌ మొదట్లో హీరోగా టీనేజ్‌ వయసులో డ్రీమ్‌బోయ్‌గా అలరించినప్పటికీ తర్వాత మాస్‌ అంటూ రెంటికి కొరగాకుండా దాదాపు డజన్‌ చిత్రాల దాకా ఫెయిల్యూర్స్‌ని మూటగట్టుకున్నాడు. 

Advertisement
CJ Advs

కానీ ఆయన తండ్రి సుధాకర్‌రెడ్డికి ఉన్న సినీ అనుభవం, పరిచయాలు, ఆర్ధిక బలం వల్ల మరలా తనదైన శైలిలో విక్రమ్‌కెకుమార్‌ వంటి క్రియేటివ్‌ దర్శకుడిని ఎంచుకుని 'ఇష్క్‌'తో మరలా గాడిలో పడ్డాడు. ఆ తర్వాత ఇక పవన్‌ని పట్టుకుని సాగిపోతూనే ఉన్నాడు. మరలా రెండు మూడూ ఫ్లాప్‌లొచ్చినా పెద్దగా ఎఫెక్ట్‌ పడలేదు. ఆయన కిందటి చిత్రం 'అఆ' తో 50కోట్ల క్లబ్‌లో చేరాడు. కానీ ఆ క్రెడిట్‌ ఆయనకు గాకుండా త్రివిక్రమ్‌, సమంతల ఖాతాలోకి వెళ్లింది. ఇక 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సమయంలోనే 14రీల్స్‌ సంస్థ దర్శకుడు హనురాఘవపూడిలోని టాలెంట్‌ని చూసి తదుపరి చిత్రానికి కూడా అతనితో అగ్రిమెంట్‌ చేయించుకోవడం నితిన్‌కి వరమైంది. 

ఎందుకంటే వారు హను రాఘవపూడితో చేయాలనుకున్న చిత్రం నితిన్‌తోనే కావడం ఇక్కడ లెక్క. ఇదే లెక్క తప్పి ఉంటే అక్కినేని అఖిల్‌ నటించే రెండో చిత్రమే హను రాఘవపూడి ఖాతాలో పడేది. ఇక 14 రీల్స్‌, హానురాఘవపూడి, కొత్త అమ్మాయి మేఘాఆకాష్‌, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌లతో ఈ చిత్రం చేస్తుండటం, అందులో నితినే హీరో కావడం నితిన్‌కి కలిసొచ్చింది. ఇక నిర్మాతలు బడ్జెట్‌కి వెనుకాడకుండా ఉండటం, వారికి బల్క్‌డేట్స్‌ ఇచ్చి నితిన్‌ సహకరించడంతో రెండు నెలలు అమెరికాలో షూటింగ్‌ జరిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. 

ఈ చిత్రంలో గడ్డంతో డిఫరెంట్‌ గెటప్‌తో కనిపిస్తున్న నితిన్‌ పాతబస్తీ కుర్రాడిగా నటిస్తున్నాడని చెబుతూనే అమెరికాలో షూటింగ్‌ జరపడం, కథానుసారమే అమెరికాలో, హైదరాబాద్‌ పాత బస్తీలో షూటింగ్‌ చేస్తుండటం చూస్తూంటే.. అందునా 'లై' అనే టైటిల్‌ ద్వారా కూడా ఈ చిత్రం మంచి ఆసక్తిని రేపుతోంది. ఆగష్టు11న విడుదలకు సిద్దమవుతోన్నఈ చిత్రం తన ఓన్‌ స్టామినాతో 50కోట్ల క్లబ్‌లో అడుగుపెడుతుందని నితిన్‌ ధీమాగా ఉన్నాడు. ఇక ఈ చిత్రం రిలీజ్‌కు ముందే శాటిలైట్‌ హక్కుల కోసం పోటీ ఏర్పడటం, ఏకంగా 7కోట్లు పలుకుతుండటంతో ఇదే నితిన్‌ కెరీర్‌ లో ఫస్ట్ అండ్ టాప్‌ పొజిషన్‌లో ఉందని అంటున్నారు. దీనిపై నితిన్‌ బోలెడు ఆశలు పెట్టుకుని ఉన్నాడు. మరి సినిమా ఫలితం కూడా బాగా ఉంటుందనే ఆశిద్దాం...! 

Nithiin Lie Movie Satellite Rights Record:

Nithiin, Hanu Raghavapudi's Lie Satellite Rights Sold For A Bomb
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs