Advertisement
Google Ads BL

చరణ్ 'మగధీర' అయితే చిరు ఏంటో తెలుసా?


చిరంజీవి 151 వ సినిమాగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రాన్ని చేస్తున్నట్లు గతంలో ఎప్పుడో ప్రకటించాడు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా అనౌన్సమెంట్ కు ముందే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' గా టైటిల్ ఫిక్స్ చేసుకున్న ఈ చిత్రం టైటిల్ మారుస్తున్నారంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.  అలా టైటిల్ ఎందుకు మారుస్తున్నారో కూడా సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది.

Advertisement
CJ Advs

'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అంటే కేవలం తెలుగుకు మాత్రమే పరిచయమున్నపేరు. కానీ ఉయ్యాలవాడని నాలుగు భాషల్లో విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న చిత్ర యూనిట్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలకు కలిపి ఒకే టైటిల్ ని పెట్టాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందంటున్నారు. అందులో భాగంగానే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' టైటిల్ ని 'మహావీర' గా మార్చినట్లు న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. అలాగే తాజాగా ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్స్ కూడా ఎక్కువయ్యాయి కాబట్టి..దీని నుండి కూడా 'మహావీర' తో ప్రాబ్లెమ్ తప్పుతుంది. మరి నిజంగానే చిరంజీవి 151 వ చిత్రానికి 'మహావీర' టైటిల్ ని ఫిక్స్ చేస్తే అది అదుర్స్ అంటూ అప్పుడే మెగా ఫాన్స్ సంబరపడిపోతున్నారు. 

'మహావీర' అనే టైటిల్ ఇటు తెలుగుకి, అటు తమిళం, హిందీ భాషలకు కరెక్ట్ గా సూట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడంతా. ఇంకా 'మహావీర' అంటే వీరత్వానికి ప్రతీక కాబట్టి ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదని అందుకే ఫైనల్ గా అదే టైటిల్ కి చిత్ర యూనిట్ కూడా కనెక్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువని అంటున్నారు. సో..రామ్ చరణ్ 'మగధీర' అయితే చిరంజీవి 'మహావీర' అన్నమాట. ఇంకోటేమిటంటే రామ్ చరణ్ ని మామ అల్లు అరవింద్ 'మగధీర' ని చేస్తే..ఇప్పుడు రామ్ చరణ్ చిరంజీవిని 'మహావీర' ని చేస్తున్నాడన్నమాట.

Chiranjeevi Uyyalawada Becomes Mahaveera:

Surender Reddy and Ramcharan are planning to title Uyyalawada as Mahaveera.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs