Advertisement
Google Ads BL

'గౌతమ్ నంద' గట్టిగా కొట్టేట్లు వున్నాడు..!


గోపీచంద్ - హన్సిక - కేథరిన్ లు నటిస్తున్న 'గౌతమ్ నంద' చిత్రం ఈ నెల 28 న విడుదలకు సిద్ధమవుతోంది. 'బెంగాల్ టైగర్' చిత్రం తర్వాత సంపత్ నంది తెరకెక్కిస్తున్న 'గౌతమ్ నంద' చిత్రం పై  భారీ అంచనాలున్నాయి. గోపీచంద్ గత చిత్రాలతో సంబంధం లేకుండా ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ లెవల్లో జరిగిన విషయం తెలిసిందే. 'గౌతమ్ నంద' చిత్రంలో గోపీచంద్ క్లాస్, మాస్ హీరోగా చాలా స్టైలిష్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గోపీచంద్ లుక్స్ అదే విషయాన్నీ చెబుతున్నాయి.

Advertisement
CJ Advs

ఇక టీజర్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం తాజాగా ఆడియో ఫంక్షన్ ని కూడా గ్రాండ్ లెవల్లో కానిచ్చేసింది. ఇక 'గౌతమ్ నంద' ఆడియో సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ ని కూడా  విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ లో గోపీచంద్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని ... గోపీచంద్ క్లాస్ లుక్, మాస్ లుక్ చూస్తుంటే తెలుస్తుంది. రెండు లుక్స్ లోని గోపీచంద్ అదరగొడుతున్నాడు. ఇక 'గౌతమ్ నంద' నిర్మాతలు ఖర్చు విషయంలో ఏ మాత్రం వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారని ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తుంటే అర్ధమవుతుంది.

ఎంతో రిచ్ గా తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్స్ అందాలు కూడా స్పెషల్ అట్రాక్షన్. హన్సిక, కేథరిన్ లు అందచందాలు సినిమాని ఇంకో లెవెల్ కి తీసుకెళతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి మరో స్పెషల్ అట్రాక్షన్. ట్రైలర్ లో ఆర్ ఆర్ వింటుంటే..థమన్ ఈసారి గట్టిగా కొడతాడనిపిస్తుంది. సినిమాని రిచ్ గా మలచడంలో, దుబాయ్ లోని సూపర్బ్ లొకేషన్స్ చూపించడంలో సౌందర్ రాజన్ కెమెరా వర్క్ అద్భుతంగా వుంది. ఇక ఇక గోపీచంద్ స్టయిల్, డైరెక్టర్ సంపత్ నంది డైలాగ్స్ తో సినిమా ఏ రేంజ్ లో వుండబోతుందో ఈ ట్రయిలర్ లో దిట్టంగా చూపించారు. చూస్తుంటే ఈసారి 'గౌతమ్ నంద' బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలానే వున్నాడు. 

Click Here to See The Trailer

Gautham Nanda Trailer Talk:

<span>The most awaited Gopichand and Sampath Nandi combination Goutham Nanda trailer is out.&nbsp;</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs