Advertisement
Google Ads BL

దసరా మిస్ అవుతున్న బాలయ్య..!


దసరాకి అనుకున్నంత పని అయింది. ఈ దసరా ఏదో అందరూ వస్తున్నామని చెబుతున్నారే గానీ చివరకు ఏదో ఒకటి రెండు తప్ప మూడో చిత్రం వచ్చే అవకాశం లేదని పలువురు ఆశావాదులు భావిస్తూ వచ్చారు. కానీ ఈ దసరాకి ఇటు నందమూరి హీరోలైన జూనియర్‌ ఎన్టీఆర్‌, బాలకృష్ణల మద్య మహేష్‌బాబు రావడం పక్కా అయింది. ఆ డేట్‌నైతేనే తెలుగుతో పాటు తమిళంలో కూడా సోలో రిలీజ్‌ సాధ్యమని మహేష్‌బాబు, మురుగదాస్‌లు భావించడమే కారణం. 

Advertisement
CJ Advs

ఈ చిత్రం మేకర్స్‌ దీని డేట్‌ని సెప్టెంబర్‌ 27కి ఫిక్స్‌ చేసేశారు. ఇక 29వ తేదీన వస్తామని ఆల్‌రెడీ బాలయ్య-పూరీల 'పైసావసూల్‌'ని షూటింగ్‌ మొదటిరోజే లాక్‌ చేశారు. దీంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ అవైటెడ్‌ మూవీని మరింత స్పీడ్‌ చేయకతప్పడం లేదు దర్శకుడు రవీంద్ర అలియాస్‌ బాబికి. ఆయన పవన్‌తో చేసిన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' విషయంలో కూడా ఇలాగే హడావుడిగా రిలీజ్‌ చేసి చేతులు కాల్చుకున్న అనుభవం బాబిది. ఈసారైనా ప్రశాంతంగా, తనకు ఫైనల్‌ అవుట్‌పుట్‌ సంతృప్తినిచ్చే వరకు సినిమాను చెక్కుదామనుకుంటే ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లు వదలడం లేదు. సో..... ఈ దసరాకి త్రిముఖ పోటీ తప్పదు.

అయితే మూడు చిత్రాలు హిట్టయినా సరే ఓపెనింగ్స్‌ని మాత్రం షేర్‌ చేసుకోక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. మరి దసరా విజేత ఎవరో తెలియాలంటే కాస్త ఆగాల్సిందే...! అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూడు చిత్రాల్లో బాలయ్య 'పైసావసూల్‌' రిలీజ్ డేట్ మారి..అంతకుముందు ప్రకటించిన డేట్ కంటే ముందే అంటే సెప్టెంబర్ 29 న కాకుండా సెప్టెంబర్ మొదటి వారం లోనే రిలీజ్ అయ్యేలా పూరి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది!  

Paisa Vasool Release Date Preponed:

Nandamuri Balakrishna and Puri Jagannath’s sensational combination Paisa Vasool release date is most likely to be pulled a bit early.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs