Advertisement
Google Ads BL

'బిగ్‌ బాస్‌' పై రంజు రంజు కామెంట్స్‌...!


ఒకవైపు 'జై లవ కుశ'లో త్రిపాత్రాభినయం, మరోవైపు బిగ్‌ బాస్‌ హోస్ట్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం కాదు... చతుర్ముఖ పోటీకి సై అంటున్నాడు. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా చేస్తున్న 'బిగ్‌ బాస్‌' షో ఈ రోజు రాత్రి 9గంటలకు స్టార్‌ మాలో ప్రారంభం కానుంది. కాగా దీనిలో పాల్గొనే సెలబ్రిటీల పేర్లు కొన్ని బయటకు వచ్చాయి. అందులో తాజాగా డ్రగ్స్‌ కేసులు ఎదుర్కొంటున్న బ్యాచ్‌ కూడా ఉందని సమాచారం. 

Advertisement
CJ Advs

దీంతో ఎన్టీఆర్‌ అభిమానుల నుంచే ఈ షోపై నెగటివ్‌ కామెంట్స్‌ వస్తున్నాయి. వాస్తవానికి హోస్ట్‌గా చేస్తున్న ఎన్టీఆర్‌కి, షోని ప్రసారం చేస్తోన్న స్టార్‌ మా నిర్వాహకులకు ఇదో పెద్ద తలనొప్పేనని చెప్పాలి. వారు బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి వెళ్లేదాకా వారు డ్రగ్స్‌ కేసులో నిందుతులని ఎన్టీఆర్‌కి, స్టార్‌ మాకి, షో నిర్వాహకులకు తెలీదు. ఇప్పుడు ఈ బ్యాచ్‌ బుల్లితెరపై 'బిగ్‌ బాస్‌' షోలో కనిపిస్తే ఆడియన్స్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది. 

ఇక తాజాగా ఈ 'బిగ్‌ బాస్‌'షోలో పాల్గొనడానికి బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబుతో పాటు సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌లు కూడా ఓకే చెప్పారట. మొత్తానికి ప్రారంభానికి ముందే ఇంతగా సంచలనం రేపుతోన్న 'బిగ్‌ బాస్‌'తొలిరోజు ఎలాంటి స్పందన వస్తుందో వేచిచూడాల్సివుంది..!

Jr NTR Fans Negetive Comments on Bigg Boss Show:

Jr NTR hosted show Bigg Boss today night 9PM start in Star MAA channel. In this show Participates There is also a batch of recently Drug cases.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs