Advertisement
Google Ads BL

సమంత సమాధానాలకు అందరూ షాక్‌..!


సమంత త్వరలో నాగ చైతన్యను పెళ్లి చేసుకుని, అక్కినేని వారింట కోడలుగా అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆమె హ్యాండ్లూమ్స్‌కి ఇచ్చిన ఫొటో షూట్‌ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆమెను తరుచుగా మీడియా ఒకే ప్రశ్నను మరీ మరీ అడిగి విసిగిస్తోంది. వారు అడిగేది ఒక్కటే.. పెళ్లి తర్వాత కూడా నటిస్తారా? అని. ఈ మాటకు ఆమె ఎన్నోసార్లు సమాధానం చెప్పింది. 

Advertisement
CJ Advs

అయినా కూడా మరోసారి అదే ప్రశ్నను మీడియా ఆమెను ప్రశ్నించడంతో ఆమెకు మండిపోయింది. ఇదే ప్రశ్నను ఒక టీచర్‌నో, డాక్టరో అడుగుతారా? మాది కూడా అలాంటి వృత్తే కదా..! మరి మమ్మల్నే ఈ ప్రశ్న పదే పదే ఎందుకు అడుగుతారు? అని మండిపడింది. ఇక మీకు ఫుడ్‌ ఇష్టమా? లేక సెక్స్‌ ఇష్టమా? అని అడిగితే సమాధానం చెప్పడం కష్టమే అయినా నాకు సెక్స్‌ అంటేనే ఇష్టం అని సమాధానం ఇచ్చి షాకిచ్చింది. 

ఇక నాగ చైతన్యతో పెళ్లి విషయంలో ఎలా ఫీలవుతున్నారు? అని అడిగితే మానసికంగా నాకు, చైతూకి ఎప్పుడో పెళ్లయిపోయింది. కానీ మా పెళ్లి కోసం ఇతరులే ఎగ్జైట్‌ అవుతున్నారని వ్యాఖ్యానించింది. చైతూ చాలా రొమాంటిక్‌, ఆయన నా కోసం ఓ ఖరీదైన బ్యాగ్‌ కొని,దానిపై స్కెచ్‌పెన్నుతో మంచి మంచి క్యూట్‌ మెసేజ్‌లు రాశాడని గుర్తు చేసుకుంది. నా హ్యాండ్‌ బ్యాగ్‌లో ఎప్పుడు ఓ నోట్‌బుక్‌, లిపిస్టిక్‌, పెన్ను, ఫోన్‌ ఉంటాయని తెలిపింది. 

తాను చేయాల్సిన పనులు మర్చిపోకుండా ఎప్పటికప్పుడు పుస్తకంలో నోట్‌ చేసుకుంటానని తెలిపింది. ఇక తాజాగా ఎప్పటినుంచో ఇవ్వకుండా ఆగిపోయిన తమిళనాడు సినీ అవార్డులను తాజాగా ప్రకటించగా 2012వ సంవత్సరానికి గాను 'ఎటో వెళ్లిపోయింది...మనసు' తమిళ వెర్షన్‌కి గాను ఆమెకి ఉత్తమ నటిగా తమిళ ప్రభుత్వ అవార్డు రావడం ఆనందకరం...!

Samantha Given Answers Shocked Everyone:

Do you like food Or sex? Asked if it was difficult to answer, she replied that she wanted sex.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs